అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి తేజస్వి డిమాండ్

ABN , First Publish Date - 2020-05-30T01:29:47+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో బీహార్‌లో తలెత్తిన పలు సమస్యలను, నిర్వహణా లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని..

అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి తేజస్వి డిమాండ్

పాట్నా: లాక్‌డౌన్ సమయంలో బీహార్‌లో తలెత్తిన పలు సమస్యలను, నిర్వహణా లోపాలను  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి ఏర్పాటు చేయాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కోరారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కరోనా లాక్‌డౌన్ సమయంలో అఖిలపక్ష సమావేశాన్ని స్పీకర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారని తెలిపారు. అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్పీకర్ ఇప్పుడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కూడా పిలుపునివ్వాలని కోరారు.


లాక్‌డౌన్ సమయంలో జరిగిన నిర్వహణాలోపాలు, అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విపక్షాలు కోరుకుంటున్నట్టు తేజస్వి చెప్పారు. లాక్‌డౌన్ కాలంలో బీహార్‌లో శాంతి భద్రతలు, వలస కూలీలను రప్పించేందుకు చేసిన ఏర్పాట్లలో అవకతవకలు వంటి పలు సమస్యలు తలెత్తాయని అన్నారు. ఇలాంటి సీరియస్ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం తమ బాధ్యతగా విపక్షాలు భావిస్తున్నాయని తేజస్వి పేర్కొన్నారు.

Updated Date - 2020-05-30T01:29:47+05:30 IST