Abn logo
Jan 25 2021 @ 00:08AM

తీగలేరు కాలువను తేరగా ఆక్రమించారు


పట్టించుకోని అధికారులు

పెద్దారవీడు, జనవరి 24 : ‘ప్రభుత్వం ఏదైనా భూమిని పంట కాలువల కోసం సేకరిస్తే ఆ భూమిని ఆ భూమి ఆ కాలువలపై సర్వహక్కులు ఇరిగేషన్‌ అధికారులుంటాయి. కాలువ కట్టలపై ఆక్రమణలు జరగకుండా నిత్యం ఆ శాఖ డీఈ, ఏఈ, లస్కర్లు తదితర విభాగాల అధికారులు పర్య వేక్షిస్తుంటారు. ఇక కాలువ కట్టల వెంబడి మెరకలను కూడా రైతులు తోలుకోవడానికి అనుమతలుండవు.’ ఇందంతా ఎందుకనుకుంటున్నారా..? పంట కాలువల పరిరక్షణకు ప్రభుత్వం పాటించే నియమాలను తెలియజేయాడానికే. అయితే మండలంలోని తీగలేరు కాలువపై అందుకు భిన్నగా ఏకంగా కాలువకే అడ్డంగా రోడ్డు వేయడం గమనార్హం.

 పెద్దారవీడు మండలంలోని హనుమాన్‌ జంక్షన్‌ కుంట సమీపంలో ఓ ప్రైవేటు కంపెనీ గుట్టుగా తీగలేరు అడ్డంగా రోడ్డు వేసింది. కేవలం ఒక ప్రైవేటు కంపెనీ తన సొంత సౌలభ్యం కోసం ఏకంగా కాలువకు అడ్డంగా రోడ్డును వేశారు. ఆయినా ఆ శాఖ అధికారులు ఆ వైపు దృష్టిసారించిన దాఖలాలు లేవు. తోటపల్లి నుంచి వచ్చే ఈ తీగలేరు కాలవ ఓబులక్కపల్లె చెరువు వరకు నిర్మించారు. వర్షాలు పడినప్పుడు ఎక్కడ నీరు నిలవకుండా ఓబులక్కపల్లె చెరువుకు నీరు చేరాలి. తద్వారా చుట్టుపక్కల పొలాల్లో వర్షపునీరు నిలవకుండా చెరువుకు చేరి పొలాలు త్వరగా ఆరతాయి. మరో వైపు ఓబులక్కపల్లె చెరువుకు కూడా నీటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కాలువకు అడ్డంగా రోడ్డు వేయడంపై అటు తీగలేరు కాలువ చుట్టుపక్కల రైతులు, ఇటు ఓబులక్కపల్లె గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు అడ్డంగా కట్టవేస్తే నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్‌ అధికారులు కాలువను కాలువకు అడ్డంగా వేసిన రహదారిని పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని రైతులు గ్రామస్థులు కోరుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement