Advertisement
Advertisement
Abn logo
Advertisement

దంతాలు మిలమిలా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి..

ఆంధ్రజ్యోతి(04-12-2021)

ఎవరితోనైనా మాట్లాడే సమయంలో అవతలి వ్యక్తి ముందుగా గుర్తించేది మీ నవ్వునే! ఆ నవ్వు ఆకట్టుకునేలా ఉండాలంటే దంతాలు తెల్లగా మెరుస్తూ ఉండాలి. మరి దంతాలు మెరవాలంటే ఇదిగో ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.


కొన్ని రకాల ఆహారపదార్థాలు దంతాలు రంగు మారడానికి కారణమవుతాయి. బీట్‌రూట్‌, బెర్రీలు, సోయాసాస్‌, వెనిగర్‌, టొమాటో సాస్‌లు ఆ కోవకు చెందినవి. కాబట్టి వీటిని వీలైనంత తగ్గించాలి. టీ, కాఫీలు దంతాల రంగును దెబ్బతీస్తాయి. 


దంతాలు రంగు మారకుండా ఉండాలంటే రోజూ రెండు సార్లు బ్రష్‌ చేయాలి. భోజనం తరువాత మౌత్‌వాష్‌ ఉపయోగించాలి. 


ఫ్రూట్స్‌, పచ్చి కూరగాయలు తినడం వల్ల దంతాలపై లేయర్‌లా ఏర్పడిన ప్లాక్‌ తొలగిపోతుంది. 


దంతాలను తెల్లగా మార్చేందుకు బేకింగ్‌ సోడా ఉపయోగపడుతుంది. కాస్త నీళ్లు తీసుకుని ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి పేస్టులా చేసి బ్రష్‌ చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయాలి.


కొబ్బరినూనెతో ఆయిల్‌పుల్లింగ్‌ చేయడం వల్ల కూడా దంతాలు తెల్లగా మారతాయి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా తొలగిపోయి ప్లాక్‌ బిల్డప్‌ కాకుండా ఉంటుంది. కొబ్బరినూనెలో లవంగాల నూనె, నువ్వుల నూనె వంటివి కలిపి ఉపయోగిస్తే ఫలితం ఇంకా బాగుంటుంది.


దంతాలకు స్ట్రాబెర్రీలు మంచి స్నేహితులని చెప్పవచ్చు. వాటిలో ఉండే మాలిక్‌ ఆసిడ్‌ వైటెనింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలను దంతాలపై రబ్‌ చేస్తే మ్యాజిక్‌ మీకే కనిపిస్తుంది. ఆరెంజ్‌ తొక్కను కూడా ఉపయోగించవచ్చు.

Advertisement
Advertisement