Oct 28 2021 @ 18:37PM

గోవాలో రొమాంటిక్‌ సాంగ్‌!

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయిక. కళ్యాణ్‌ జి. గోగణ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. హై యాక్షన్‌ వోల్టేజ్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌ మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై రొమాంటిక్‌ పాటను తెరకెక్కిస్తున్నారు. ఆది డాన్స్‌, పాయల్‌ రాజ్‌ పుత్‌ గ్లామర్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నటిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉంది. సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు.