గర్భవతి అయిన టీనేజర్ బాలిక.. దానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలిసి ఆమె తల్లిదండ్రులు షాక్.. ఆ తరువాత ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-02-23T06:06:55+05:30 IST

ఒక 16 ఏళ్ల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్ష చేసి ఆ బాలికకు గర్భస్రావం(అబార్షన్) జరగడం వల్ల కడుపునొప్పి వచ్చిందని చెప్పారు. ఇది విని ఆ తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి గురించి తెలుసుకొని...

గర్భవతి అయిన టీనేజర్ బాలిక.. దానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలిసి ఆమె తల్లిదండ్రులు షాక్.. ఆ తరువాత ఏం చేశారంటే..

ఒక 16 ఏళ్ల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్ష చేసి ఆ బాలికకు గర్భస్రావం(అబార్షన్) జరగడం వల్ల కడుపునొప్పి వచ్చిందని చెప్పారు. ఇది విని ఆ తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి గురించి తెలుసుకొని అతడిని నిలదీశారు. కానీ ఆ వ్యక్తి మరింత దారుణానికి ఒడిగట్టాడు.


దేశ రాజధాని సమీపంలోని నోయిడా నగరాని చెందిన షీలా(16, పేరు మార్చబడినది) అన బాలిక ఇటీవల తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా.. ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. షీలాకు గర్భస్రావం జరిగిందని.. అందువల్లే కడుపునొప్పి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. దీంతో షీలా తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. అసలేం జరిగిందని షీలాను ఆమె తల్లి ప్రశ్నించింది. అప్పుడు షీలా చెప్పిన నిజం విని.. ఆమె తట్టుకోలేకపోయింది. షీలా ఒకసారి బట్టలు మార్చుకుంటుండగా.. ఆమె బావ(అక్క భర్త) జీతేంద్ర దొంగచాటుగా వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి.. ఆమెను లొంగదీసుకున్నాడు. అలా షీలాను పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి.. జీతేంద్ర ఆమెపై అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల తరువాత షీల గర్భవతి అయింది. దీంతో జీతేంద్ర ఆమెను ఆస్పత్రికి తీసుకుపోయి అబార్షన్(గర్భవతి) చేయించాడు. 


అబార్షన్ వల్ల షీలా ఆరోగ్యం క్షీణించడంతో.. ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఆ తరువాత షీలా తల్లి జీతేంద్రను తన కూతురి జీవితాన్ని నాశనం చేసినందుకు నిలదీసింది. అతనితో గొడవ పడింది. అప్పుడు జీతేంద్ర మరో దారుణానికి పాల్పడ్డాడు. షీలా నగ్నంగా ఉన్న వీడియోలన సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో షీలా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు జీతేంద్రను అరెస్టు చేసి అతనిపై పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-02-23T06:06:55+05:30 IST