Abn logo
Sep 19 2021 @ 07:55AM

Dubai లో తండ్రిపై కేసు వేసిన టీనేజర్.. కారణమేంటంటే..

దుబాయ్: 17 ఏళ్ల ఓ టీనేజర్ తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంచి మార్కుల కోసం తనను చదివిన తరగతినే మళ్లీ చదవాలని తండ్రి తనను బలవంతం చేస్తున్నట్లు టీనేజర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో దుబాయ్ పోలీసులు ఈ కేసును చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ విభాగానికి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు తండ్రి, కుమారుని మధ్య సయోధ్య కుదిర్చారు. పిల్లల అభిప్రాయాన్ని గౌరవించాలని తండ్రిని, తండ్రి మాటకు విలువ ఇవ్వాలని కుమారుడిని నచ్చజెప్పారు.


చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం చీఫ్ మైథా మహ్మద్ అల్ బలుషి తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన టీనేజర్ తన తల్లితో కలిసి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి తనను మంచి మార్కుల కోసం చదివిన తరగతిలోనే మళ్లీ చదవాలని ఫోర్స్ చేస్తున్నాడని, అలా చేయడం తనకు ఇష్టం లేదని తెలిపాడు. దీంతో పోలీసులు ఈ కేసును ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు సిఫార్సు చేశారు. దాంతో సంబంధిత అధికారులు ఆ టీనేజర్‌ను పిలిచి మాట్లాడారు. తాను చదివే కాలేజీలోనే తన తండ్రి కూడా పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా టీనేజర్ చెప్పాడు.


ఇవి కూడా చదవండి..

Dubai కీలక ప్రకటన.. ఇకపై UAE కి వచ్చేవాళ్లు ఎంత డబ్బు తీసుకురావచ్చంటే..

ఆ రెండు దేశాల వారికి e-visas లు ఇచ్చేది లేదన్న India..


అయితే, తాను ఇప్పటికే పూర్తి చేసిన గ్రాడ్యుయేషన్‌లో మంచి గ్రేడ్ రాలేదని, దానికోసం మరోసారి అదే తరగతిలో చదవాలని చెబుతున్నట్లు తెలిపాడు. అంతేగాక ప్రతి విషయంలో తండ్రి తనను ఇబ్బందికి గురి చేస్తున్నట్లు చెప్పాడు. తన అభిప్రాయాలకు అసలు విలువ ఇవ్వడం లేదని, ఆయన చెప్పింది చేయాలంటూ కరాఖండిగా చెప్పడం తనకు నచ్చడం లేదని చెప్పుకొచ్చాడు. దాంతో టీనేజర్ తండ్రిని పిలిపించారు అధికారులు. ఆయన మాత్రం కొడుకు భవిష్యత్ బాగుండాలనే ఆలోచనతో ఇన్నాళ్లు  కుమారుడికి చదువు విషయంలో తగు సూచనలు చేసినట్లు చెప్పారు. అది అతనికి ఇబ్బంది కలిగిస్తుందని తాను అనుకోలేదని, ఇకపై అలా చేయబోనని తెలిపారు.


కుమారుడి చదువు విషయంలో ఇకపై తన జోక్యం ఉండబోదని, పూర్తిగా అతని ఇష్టానికే వదిలేస్తానని అధికారులతో చెప్పారు. ఈ సందర్భంగా మానవ హక్కుల సాధారణ విభాగంలోని చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మేజర్ డాక్టర్ అలీ మహమ్మద్ అల్ మాతృషి మాట్లాడుతూ చట్టం ప్రకారం ప్రతి అబ్బాయి లేదా అమ్మాయి తమ అభిప్రాయాలను తల్లిదండ్రుల వద్ద వ్యక్తపరిచే హక్కు ఉంది. పేరెంట్స్‌ పిల్లల అవసరాలను గుర్తించి, వారి అభిప్రాయాలకు విలువ ఇస్తే బావుంటుంది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించాలి. వారు ఏం చేసిన పిల్లల భవిష్యత్ బాగుండాలనే ఆలోచిస్తారంటూ అల్ మాతృషి చెప్పుకొచ్చారు. 

 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...