పబ్జీ గేమ్ ఆడొద్దన్నందుకు.. తన కుటుంబాన్ని అంతం చేసిన బాలుడు..

ABN , First Publish Date - 2022-01-31T05:41:23+05:30 IST

పబ్జీ వీడియో గేమ్ అంటే తెలియని వారుండరు. ఈ వీడియో గేమ్ ఆడుతూ ఎంతో మంది వ్యసనానికి బానిసలయ్యారు. అలాంటి వారికి ఆ గేమ్ రోజు ఆడకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. ఇంట్లో వారికి అలా చేయొద్దని ఎంత వారించినా.. పట్టించుకోరు. పైగా కొంతమంది హింసాత్మకంగా మారుతున్నారు. తాజాగా ఒక 14 ఏళ్ల కుర్రాడు పబ్జీ కోసం తన తల్లి...

పబ్జీ గేమ్ ఆడొద్దన్నందుకు..  తన కుటుంబాన్ని అంతం చేసిన బాలుడు..

పబ్జీ వీడియో గేమ్ అంటే తెలియని వారుండరు. ఈ వీడియో గేమ్ ఆడుతూ ఎంతో మంది వ్యసనానికి బానిసలయ్యారు. అలాంటి వారికి ఆ గేమ్ రోజు ఆడకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. ఇంట్లో వారికి అలా చేయొద్దని ఎంత వారించినా.. పట్టించుకోరు. పైగా కొంతమంది హింసాత్మకంగా మారుతున్నారు. తాజాగా ఒక 14 ఏళ్ల కుర్రాడు పబ్జీ కోసం తన తల్లి, సోదరుడు, ఇద్దరు అక్కచెల్లెళ్లను హత్య చేశాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌ దేశంలోని లాహోర్ నగరంలో నివసించే నహిద్ ముబార్(45) అనే మహళ భర్త నుంచి కొన్నేళ్ల క్రితమే విడిపోయి తన నలుగురు పిల్లలతో ఉంటోంది. కుటుంబాన్ని పోహించడానికి హెల్త్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె చిన్న కుమారుడు షోయెబ్ చదువుపై ఆసక్తి లేక ఇంటి వద్దనే ఉంటూ పబ్జీ వీడియో గేమ్‌కు బానిసయ్యాడు. అతనికి ఈ వీడియ గేమ్ వ్యసనంగా మారుతుందని భావించిన తల్లి పలుమార్లు మందలించింది. కానీ అతను తల్లి మాట వినేవాడు కాదు.


ఒక రోజు నహీద్ ఇంట్లో షోయెబ్‌ని మళ్లీ మందలించింది. అప్పుడు ఆ సమయంలో అతను తల్లికి ఎదురు తిరిగాడు.. దీంతో అక్కడే ఉన్న నహీద్ పెద్ద కుమారుడు తమ్ముడిని చితకబాదాడు. తనను కొట్టారన్న కోపంతో షోయెబ్ ఇంట్లోని అల్మిరాలో నుంచి తుపాకీ తీసి అన్నను అడ్డొచ్చిన తల్లిని కాల్చి చంపాడు. ఎంతపని చేశావని అతని అక్కాచెల్లెళ్లు చెప్పగా.. వారిని కూడా తుపాకీతో కాల్చేశాడు.


ఆ తరువాత షోయోబ్ తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశఆడు. తన కుటుంబాన్ని ఎవరో చంపారంటూ పొరుగింటి వారికి తెలియజేశాడు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతుల ఇంటికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించారు. అయితే తనకు ఏమీ తెలియదని.. ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లో పైగదిలో ఉన్నానని షోయెబ్ బుకాయించాడు. అతని మాటలు విని పోలీసులు అనుమానం తమ పద్ధతిలో విచారణ చేశారు. దీంతో అతడు అసలు నిజం బయటపెట్టాడు. తాను పబ్జీలో తుపాకీతో కాల్చినట్టే నిజజీవితంలో కోపంతో కాల్చానని చెప్పాడు. ఆ తరువాత తుపాకీని మురికి కాలువలో పడేశానని పోలీసులకు తెలిపాడు. పబ్జీకి బానిసై పోవడంతో బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు పోలీసులు నిర్ధారణ చేసి.. అతనికి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.


ఇలాంటి మరో ఘటన భారత్‌లో గత నవంబర్‌లో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లక్నో నగరంలో  పబ్జి గేమ్ ఆడుతూ ఇద్దరు పిల్లలు రైలు పట్టాలపైకి వెళ్లారు. అక్కడ అదే సమయంలో గూడ్స్ ట్రైన్ వారి మీద నుంచి దూసుకెళ్లడంతో వారిద్దరూ ట్రాక్ పైనే ప్రాణాలు వదిలారు.

Updated Date - 2022-01-31T05:41:23+05:30 IST