కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన బాలిక.. గర్భం అని తేల్చిన వైద్యులు.. కారణమెవరో తెలిసి ఆమె తల్లిదండ్రులు షాక్!

ABN , First Publish Date - 2022-04-17T09:11:50+05:30 IST

ఆ మైనర్ బాలికకు నెల రోజుల క్రితం కడుపునొప్పి మొదలైంది.. తండ్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు.. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఐదు నెలల గర్భవతి అని తేల్చారు.. పోలీసులకు సమాచారం అందించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలికకు డీఎన్‌ఏ టెస్ట్ చేశారు..

కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన బాలిక.. గర్భం అని తేల్చిన వైద్యులు.. కారణమెవరో తెలిసి ఆమె తల్లిదండ్రులు షాక్!

ఆ మైనర్ బాలికకు నెల రోజుల క్రితం కడుపునొప్పి మొదలైంది.. తండ్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు.. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఐదు నెలల గర్భవతి అని తేల్చారు.. పోలీసులకు సమాచారం అందించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలికకు డీఎన్‌ఏ టెస్ట్ చేశారు.. ఆ బాలిక గర్భానికి స్వంత సోదరుడే కారణమని తెలిసి అందరూ షాకయ్యారు. 


బీహార్‌లోని పాట్నాకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆమె తండ్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ బాలిక ఐదు నెలల గర్భవతి అని తేల్చారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాలికను ప్రశ్నించగా ఆమె అసలు విషయం బయటపెట్టింది. 2020 డిసెంబర్‌లో తాను స్వగ్రామానికి వెళ్లినపుడు సోదరుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు తెలిపింది.


తనను చంపుతానని బెదిరించి తనపై చాలా సార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. భయపడి ఆ విషయం గురించి ఎవరికీ చెప్పలేదని తెలిపింది. పోలీసులు ఆ బాలిక గర్భంలో ఎదుగుతున్న పిండానికి, నిందితుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించగా ఆమె చెప్పింది నిజమేనని తేలింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-17T09:11:50+05:30 IST