Abn logo
Jan 24 2021 @ 01:13AM

19ఏళ్ల టీనేజర్‌కు 27 మంది తల్లులు..!

వాషింగ్టన్: ఓ 19ఏళ్ల టీనేజర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తనకు ఏకంగా 27 మంది తల్లులు ఉన్నారని.. 149 మంది తోబుట్టువులు ఉన్నారంటూ చేసిన అతను వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. తన తండ్రి విన్‌స్టన్ బ్లాక్‌మోర్ (64).. ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకున్నట్టు బ్రిటీష్ కొలంబియాకు చెందిన మెర్లిన్ బ్లాక్‌మోర్ (19) సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇందులో 22 మందికి పిల్లలు కలగడంతో తనకు 149 మంది తోబుట్టువులు ఉన్నట్టు పేర్కొన్నాడు. తన తండ్రితో తనకు సత్సంబంధాలు లేకపోవడంతో మూడేళ్ల క్రితం ఇల్లు వదిలి అమెరికాకు వచ్చినట్టు పేర్కొన్నాడు. అయితే తోబుట్టువులతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నట్టు చెప్పాడు. అంతేకాకుండా తన ఫ్యామిలీ ఫొటోను నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నందుకుగాను స్థానిక పోలీసులు విన్‌స్టన్‌పై కేసు నమోదు చేశారు.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement