Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 21 May 2022 19:54:13 IST

Praggnanandhaa: ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్‌ను రెండోసారి ఓడించిన ప్రజ్ఞానంద

twitter-iconwatsapp-iconfb-icon

న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు ( Praggnanandhaa)  మరోమారు సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్లస్‌ (Magnus Carlsen)పై ఈ ఏడాది రెండోసారి విజయం సాధించాడు. చెస్సబుల్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటులో శుక్రవారం 16 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్‌తో ఐదో రౌండ్‌లో తలపడ్డాడు. ఇద్దరూ నువ్వా? నేనా? అన్నట్టు తలపడడంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయమని అనిపించింది.


అయితే, చివర్లో కార్ల్‌సన్ 40వ మూవ్‌లో చేసిన పొరపాటును సద్వినియోగం చేసుకున్న ప్రజ్ఞానంద విజయం సాధించాడు.  దీంతో 12 పాయింట్లతో నాకౌట్ దశకు మరింత దగ్గరయ్యాడు. ప్రజ్ఞ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుండగా, కార్ల్‌సన్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, ఫిబ్రవరిలోనూ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్‌‌లైన్ ర్యాపిడ్ చెస్ టెర్నమెంటులో 8వ రౌండ్‌లో భారత గ్రాండ్ మాస్టర్ చేతిలో కార్ల్‌సన్ ఓటమి పాలయ్యాడు. 


కార్ల్‌సన్‌పై విజయం సాధించిన అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. తాను పరీక్షలకు హాజరవుతున్నట్టు చెప్పాడు. తన ప్రదర్శనపై పెదవి విరిచాడు. ఈ విజయం తనకు సంతోషం కానీ, థ్రిల్ కానీ ఇవ్వలేదన్నాడు. మ్యాచ్ సందర్భంగా కొంత స్టఫ్, కొన్ని ట్రిక్స్, మరికొన్నివ్యూహాలను మిస్సయినట్టు పేర్కొన్నాడు. తాను మరింతగా పదును తేలాలని చెప్పుకొచ్చాడు. ప్రజ్ఞానంద చేతిలో ఓటమి పాలైన కార్ల్‌సన్ ఈసారి అమెరికాకు చెందిన 13 ఏళ్ల అభిమన్యు మిశ్రాతో తలపడతాడు. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.