Congressలోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి?

ABN , First Publish Date - 2022-07-05T17:08:24+05:30 IST

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ(Congress Party) తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.

Congressలోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి?

Hyderabad : మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ(Congress Party) తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఈనెల 11న కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మంత్రి సబిత ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy), తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) మధ్య పంచాయతీ ముదిరింది. సబితా ఇంద్రారెడ్డి తీరుపై తీగల కృష్ణారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. మంత్రాలయ చెరువు దగ్గర.. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని తీగల వ్యతిరేకిస్తున్నారు. చెరువుల పరిరక్షణ కోసం ఆమరణ దీక్ష చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ట్రంక్ లైన్ నిర్మాణం ఇప్పటివరకూ చేయలేదని సబితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబిత టీఎర్ఎస్ నుంచి గెలవ లేదని తీగల కృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.





సబిత ఏ క్షణమైతే కాంగ్రెస్‌ను వీడి.. టీఆర్ఎస్‌లో చేరారో నాటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. తీగల కృష్ణారెడ్డిది ఓవర్గం… మంత్రి సబితా ఇంద్రారెడ్డిది మరోవర్గం. ఈ రెండు వర్గాల మధ్య పరిస్థితి రాను రానూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరింది. సబిత ఇలా వచ్చి అలా మంత్రి అయ్యారు. అంతేకాదు.. ఆమె తన అనుచరులకే పెద్ద పీట వేస్తున్నారని..  వారికే ప్రాధాన్యమిస్తున్నారనేది తీగల వర్గం ఆరోపణ. సబిత పార్టీలో చేరిన అనంతరం నుంచి తనకు ప్రాధాన్యం తగ్గిందనే ఆవేదనలో ఉన్న తీగలకు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన అనంతరం కాస్త భరోసా దొరికట్టైంది. రేవంత్ సైతం తీగలను పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంతకాలంగా పార్టీ మారడంపై ఆలోచనలో ఉన్న తీగలకు మారుతున్న రాజకీయ పరిస్థితులు మరింత ఊతమిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారుతారని సమాచారం.

Updated Date - 2022-07-05T17:08:24+05:30 IST