ఎయిర్‌ ఇండియాలో సాంకేతిక సమస్య

ABN , First Publish Date - 2022-04-08T02:34:07+05:30 IST

గత మూడు రోజులుగా గన్నవరం-బెంగళూరు విమాన సర్వీసును సాంకేతిక సమస్య వెంటాడుతోంది. దీంతో విమానాన్ని అధికారులు రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ఎయిర్‌ ఇండియాలో సాంకేతిక సమస్య

గన్నవరం: గత మూడు రోజులుగా గన్నవరం-బెంగళూరు విమాన సర్వీసును సాంకేతిక సమస్య వెంటాడుతోంది. దీంతో విమానాన్ని అధికారులు రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొందరు బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కనెక్టివిటీ విమానాల్లో వెళ్లేవారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బెంగళూరు నుంచి 9ఐ501 నెంబర్‌ ఎయిరిండియా విమానం 65మంది ప్రయాణికులతో గురువారం ఉదయం 9.30కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చింది. తిరిగి అదే విమానం 64మంది ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. ల్యాండింగ్‌ అయిన తరువాత ఫైలెట్‌ పరిశీలించగా టైర్‌ క్లోసింగ్‌ డోర్‌ విరిగినట్టు గుర్తించారు. ప్రయాణికులు కొద్ది సేపట్లో బోర్డింగ్‌ అవ్వాల్సి ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. సర్వీసు కూడా రద్దు చేసినట్టు ప్రకటించటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా బెంగళూరు వెళ్లేందుకు వస్తున్నామని ఏదొక కారణం చెప్పి విమానం రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2022-04-08T02:34:07+05:30 IST