టెక్నికల్‌ కోర్సులకు ప్రాధాన్యం ఎక్కువ

ABN , First Publish Date - 2022-07-03T04:44:38+05:30 IST

టెక్నికల్‌ కోర్సులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువని జిల్లా సమ గ్ర శిక్ష పథక సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

టెక్నికల్‌ కోర్సులకు ప్రాధాన్యం ఎక్కువ
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి

జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి 

కడప(ఎడ్యుకేషన్‌), జూలై 2: టెక్నికల్‌ కోర్సులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువని జిల్లా సమ గ్ర శిక్ష పథక సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరం ప్రభుత్వ పాఠశాలలో టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్సుకు సంబంధించి మే 23వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు 42 రోజులు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టైలరింగ్‌ డ్రాయింగ్‌ సంగీతం, అల్లికలు కుట్లు లాంటి నైపుణ్య కోర్సుల్లో టెక్నికల్‌ టీచింగ్‌ సర్టిఫికెట్‌ పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుం దన్నారు. స్వీయ నైపుణ్యంతో ఇతరులకు సైతం ఉపాధి కల్పించవచ్చన్నారు.ఇలాంటి శిక్షణను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ ధనలక్ష్మి, సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్‌ కేశవరెడ్డి, దశరథరామ్‌రెడ్డి, రామాంజనేయరెడ్డి, కోర్స్‌ డైరెక్టర్‌ మేరీ, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T04:44:38+05:30 IST