NIT పట్నాలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

ABN , First Publish Date - 2022-09-30T22:00:57+05:30 IST

పట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute of Technology)(నిట్‌) - రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది

NIT పట్నాలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

పట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute of Technology)(నిట్‌) - రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి. 

విభాగాలు: వాటర్‌ రిసోర్సెస్‌ అండ్‌ హైడ్రాలిక్‌ ఇంజనీరింగ్‌, హెవీ స్ట్రక్చర్‌, పవర్‌ సిస్టం ల్యాబ్‌, ఎలక్ట్రికల్‌ మెషిన్‌ ల్యాబ్‌/ బేసిక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ల్యాబ్‌, ఆర్‌ఎఫ్‌ అండ్‌ మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్‌, వీఎల్‌ఎ్‌సఐ, కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, మైక్రోప్రాసెసర్‌/ మైక్రో కంట్రోలర్‌, ఫిజికల్‌ ల్యాబ్‌, కెమిస్ట్రీ ల్యాబ్‌, ఆర్కిటెక్చర్‌ ల్యాబ్‌/ స్టూడియో, సర్వర్‌ అడ్మినిస్ట్రేషన్‌, ప్రోగ్రామింగ్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌, హార్డ్‌వేర్‌, వెబ్‌ ప్రోగ్రామింగ్‌, 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమా/ బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణులు; ద్వితీయ శ్రేణి మార్కులతో మాస్టర్స్‌ (సైన్స్‌) డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగానికి నిర్దేశించిన స్పెషలైజేషన్‌లు, సబ్జెక్ట్‌ల వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. దరఖాస్తు నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200; దివ్యాంగులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 3

దరఖాస్తు హార్డ్‌ కాపీ చేరేందుకు చివరి తేదీ: అక్టోబరు 10

చిరునామా: రిజిస్ట్రార్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పట్నా, అశోక్‌ రాజ్‌పత్‌, పట్నా - 800005

వెబ్‌సైట్‌: www.nitp.ac.in

Updated Date - 2022-09-30T22:00:57+05:30 IST