Abn logo
Sep 21 2021 @ 13:33PM

దొరికిన బంగారాన్ని తిరిగిచ్చిన సాప్ట్‌వేర్ ఉద్యోగులు

చెన్నై: రోడ్డు మీద ఒక టీ దుకాణం సమీపంలో దొరికిన బంగారాన్ని సాప్ట్‌వేర్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు దాని యజమానికి తిరిగిచ్చిన సంఘటన పెరుంబక్కంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే...ఎస్.బాలసుబ్రమణియన్, వి.శీనువాసన్ పెరుంబక్కంలోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. కార్యాలయంలో విధులు ముగించుకుని శనివారం ఇంటికి వస్తుండగా సమీపంలోని ఒక దుకాణం వద్ద టీ తాగుతుండగా రహదారి మీద వారికి ఒక బ్రాస్‌లెట్, గొలుసు, రెండు రింగులు కనిపించాయి. మొదట వారు దానిని నకిలీ బంగారం అనుకున్నారు. చేతితో తాకిన అనంతరమే అది నిజమైనది అని నిర్ధారించుకున్నారు. ఎవరైనా ప్రాంక్ వీడియో చేస్తున్నారమోనని చుట్టుపక్కల కూడా తీక్షణంగా చూశారు. టీ దుకాణంలో పనిచేసే సిబ్బందిని బంగారం గురించి ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదు. అనంతరం వారు బంగారాన్ని టీ దుకాణంలో పనిచేసే సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.  బంగారం పోయిందని ఎవరైనా వెతుక్కుంటూ వస్తే దాని యజమానికి అందజేయాలని కోరారు. కానీ, సిబ్బంది అందజేస్తారో, లేదో అనే ఆందోళన వారిలో నెలకొంది. అనంతరం వారు టీ దుకాణానికి వచ్చి బంగారాన్ని వెనక్కి తీసుకోని పెరుంబక్కం పోలీసుస్టేషన్‌లో అందజేశారు. పోలీసులు సోమవారం ఉదయం బంగారాన్ని పొగొట్టుకున్న యజమానికి తిరిగిచ్చేశారు.   

ప్రత్యేకంమరిన్ని...