Abn logo
Sep 25 2021 @ 01:08AM

America లో ఐటీ వ్యాపారాన్ని వదిలి.. వీధి జీవాల కోసం India కి..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో సొంత ఐటీ కంపెనీ. లక్షల్లో సంపాదన. ఇంతకుమించి జీవితంలో ఇంకేం కావాలంటారా..?  కానీ ఇదేమీ తమకు అవసరం లేదనుకుని ఓ ఎన్నారై జంట భారత్ తిరిగొచ్చేసింది. ఇక్కడ వీధి జీవాలను కాపాడేందుకు ఓ సంస్థను స్థాపించింది. అలాగే చుట్టుపక్కల ప్రజలతో వ్యవసాయం చేయిస్తూ ఆ ఉత్పత్తులను విక్రయిస్తూ ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతోంది.

రాబిన్ సింగ్, శివానీ.. భారత రాజధాని ఢిల్లీకి చెందినవారు వీరిద్దరూ. అయితే అమెరికాలో సొంతంగా ఐటీ కంపెనీ స్థాపించి అక్కడే స్థిరపడ్డారు. కానీ ఆ జీవితం వారికి నచ్చలేదు. జీవితానికి ఓ అర్థం ఉండాలని, అందుకోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. అదే ఆలోచనతో భారత్ తిరిగి వచ్చేశారు. 2014లో పీపల్ ఫార్మ్ అనే సంస్థను స్థాపించారు. దాని ద్వారా వీధి జీవాలను రక్షించడం ప్రారంభించారు. అలాగే వాటి కోసం ఓ ఆసుపత్రిని సైతం ఏర్పాటు చేసి చికిత్స అందించడం మొదలుపెట్టారు.

అలాగే స్థానిక గ్రామస్థులను, అలాగే ఇతర ప్రాంతాల ప్రజలను కలుపుకొని రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను సాగు చేయసాగారు. వీటిని మార్కెట్లలో విక్రయించి కొంత డబ్బు సంపాదించేవారు. దీని ద్వారా స్థానికుల ఆర్థిక స్థితిగతుల్లో సైతం మార్పులు తీసుకొచ్చారు. ఇక వీరి సంస్థ ఎక్కువగా డొనేషన్స్‌పైనే ఆధారపడి నడుస్తోంది. అలాగే ప్రకటనల ద్వారా కూడా కొంత ఆదాయం లభిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ ఆసుపత్రిలో ఎన్నో జంతువులకు సాయం అందించారు రాబిన్ సింగ్, శివాని సాయం చేశారు. అలగే ఆయా జంతువులను విదేశాల్లోని వారు సైతం దత్తత తీసుకునేందుకు అనువుగా ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపించించారు. సోషల్ మీడియా వేదికగా వీధి జంతువుల గురించి తెలుసుకుని, వాటికి సాయం అందించడం జరుగుతుందని, తమ సంస్థ వాలంటీర్లు, స్థానిక ప్రజలు కూడా తమకు సాయం చేస్తారని వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption