ఈ పీఆర్సీ మాకొద్దు

ABN , First Publish Date - 2022-01-20T01:47:30+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగించే పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ పీఆర్సీ మాకొద్దు
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన

ఉదయగిరి రూరల్‌, జనవరి 19: ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగించే పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో పాఠశాలల అభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన సమావేశాన్ని వారు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలతో కూడిన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఐఆర్‌ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను గతంలో మాదిరిగానే ఉంచి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షేక్‌ నాయబ్‌, ఎడమ తిరుపతయ్య, షేక్‌ గాజుల ఫారుఖ్‌అలీ, ఎలిషా, షబ్బీర్‌అహ్మద్‌, ఓబులేసు, ఖాదర్‌బాషా, మొహ్మద్‌గౌస్‌, హుస్సేన్‌బాషా, గౌస్‌బాషా, భిక్షాలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T01:47:30+05:30 IST