Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 25 Dec 2021 00:05:51 IST

టెక్‌టాక్ ‌A TO Z

twitter-iconwatsapp-iconfb-icon
టెక్‌టాక్ ‌A TO Z

ఏటికేడాది సాంకేతికరంగంలో వినూత్న ఆవిష్కరణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని అవసరానుగుణం కాగా మరికొన్ని కాలానుగుణంగా జరిగే అభివృద్ధికి సంకేతాలు. చిప్‌ కొరత ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. ఎలన్‌మస్క్‌ ఈ  సంవత్సరం వార్తల్లో ప్రముఖుడు. ఈ ఏడాది మార్కెట్‌ను ముంచెత్తిన ప్రొడక్ట్‌లు, సైబర్‌ సెక్యూరిటీకి వచ్చిన ముప్పులు తదితరాలు ఇలా ఉన్నాయి. 

టెక్‌టాక్ ‌A TO Z

ఎ యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌: యాపిల్‌ కొంగ్రొత్త ఉత్పత్తులతో ఈ ఏడాదంతా బిజీగా ఉంది. నాలుగు ఐఫోన్లు, కొత్త ఎయిర్‌పాడ్స్‌, ఎయిర్‌ట్యాగ్‌, మల్టిపుల్‌ మాక్స్‌, ఐపాడ్స్‌, యాపిల్‌ వాచీలతో మార్కెట్‌ను ముంచెత్తింది. రూ.1999తో పాలిషింగ్‌ క్లాత్‌ సంచలనమే సృష్టించింది. దీనికి మరీ అంత ధరా అంటూ కొన్ని రోజులు మీమ్స్‌ వెల్లువెత్తాయి.


టెక్‌టాక్ ‌A TO Z

బి  బిట్‌ కాయిన్‌ ప్లస్‌ ఇతర క్రిప్టోలు: క్రిప్టో కరెన్సీ ఏమంత కొత్త కానప్పటికీ, భారత్‌లో ప్రధానస్రవంతిలోకి వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా కొత్త అవకాశమే అయినప్పటికీ భారత ప్రభుత్వం నిషేధించే యోచనలో ఉండటంతో క్రిప్టో కరెన్సీపై అనిశ్చితి కొనసాగుతోంది. 

టెక్‌టాక్ ‌A TO Z


 సి చిప్‌లకు కొరత: ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల కొరత కొనసాగుతోంది. ఇది భిన్న కేటగిరిల అవసరాలకు ఆటంకంగా పరిణమించింది. స్మార్ట్‌ ఫోన్ల ఖరీదు పెరిగింది. సంబంధిత ఉత్పత్తుల రవాణా మందగించింది. కనుచూపు మేరలో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశమే లేదు. దాంతో ఈ ఏడాది అటు ఉత్పత్తిదారులకు, ఇటు వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది.


టెక్‌టాక్ ‌A TO Z

డి డెలివరీస్‌: రెండేళ్ల నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లు, డెలివరీల విషయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఫుడ్‌ డెలివరీలో స్విగ్గీ, బ్లింకిట్‌(ఇదివరకు గ్రోఫెర్స్‌) అలాగే నిత్యావసర వస్తువులను అందించడంలో అమెజాన్‌ పాత్ర ఈ కొవిడ్‌ సంక్షోభ సమయంలో కీలకంగా మారింది. అనునిత్యం సాగే వ్యవహారంగా ‘డెలివరీ’ రూపొందింది.  

టెక్‌టాక్ ‌A TO Z

 ఇ ఎలన్‌ మస్క్‌: ఈ ఏడాది వార్తల్లో వ్యక్తి. టెస్లా మార్కెట్‌ వాల్యూ విపరీతంగా పెరిగింది. స్పేస్‌ఎక్స్‌తో ప్రొడక్ట్‌లు విడుదల చేసిన ఆయన ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఇళ్ళకు తీసుకు వచ్చే యోచనలో ఉన్నారు. గడచిన ఏడాదిలో పెద్ద మొత్తం పోగేసుకున్న ఆయన ప్రపంచంలోనే ధనవంతుడిగా విరాజిల్లుతున్నాడు.

టెక్‌టాక్ ‌A TO Z

 ఈ  ఫోల్డబుల్‌ (మడత పెట్టగలిగే) ఫోన్లు: ఇంకా మెయిన్‌ స్ట్రీమ్‌లోకి రానప్పటికీ ఫోల్డబుల్‌ ఫోన్లు సందడి చేస్తున్నాయి. యాపిల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌  - ఐఫోల్డ్‌/ ఐఫ్లిఫ్‌ పేరిట వస్తోంది. శాంసంగ్‌ కూడా ఇదే ప్రయత్నంలో ఉంది. ఒప్పో కూడా కలిసి వస్తోంది. మొత్తానికి 2022లో   ఫోల్డబుల్‌ ఫోన్లు మార్కెట్‌ను ఊపే అవకాశాలు మెండుగా  ఉన్నాయి. 

టెక్‌టాక్ ‌A TO Z

ఎఫ్ గూగుల్‌ పిక్సల్‌: గూగుల్‌ సైతం వివిధ ఉత్పత్తులతో మార్కెట్లో సందడి చేసింది. జీమెయిల్‌, మ్యాప్స్‌ ఇందులో ఉన్నాయి. వీటికి మించి పిక్సల్‌ టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. సరికొత్తది, అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ప్రాసెసర్‌, గుడ్‌ లుక్స్‌, గుడ్‌ కెమెరా - ఇదే ఈ ఏడాది హాట్‌ టాపిక్‌. అయితే ఇది ఇంకా మనదేశీయ మార్కెట్‌లోకి రాలేదు. 

టెక్‌టాక్ ‌A TO Z

హైబ్రిడ్‌ వర్క్‌ప్లాన్‌: కొవిడ్‌ సంక్షోభం ఐటీ కంపెనీల కార్పొరేట్‌ వర్క్‌ కల్చర్‌ కొంప ముంచింది. 2021 మొత్తం ఆఫీసుల వైపు చూడలేని పరిస్థితి నెలకొంది. కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్‌ అంటే కొద్ది రోజులు ఆఫీసు - కొద్ది రోజులు ఇంటి వద్ద పనిచేసేలా హైబ్రిడ్‌ వర్క్‌ప్లాన్‌కు ఐటీ కంపెనీలు శ్రీకారం చుడుతున్నాయి. 

టెక్‌టాక్ ‌A TO Z

 ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ పరంపర ఆరంభమైంది. వీడియోలకు యాప్స్‌ తప్ప ఫొటోలకు ఇంకెంతమాత్రం నెలవు కాబోదని ఇన్‌స్టాగ్రామ్‌ అధికారికంగానే తెలిపింది. మొత్తానికి ఈ క్రెడిట్‌ టిక్‌టాక్‌కే చెందుతుంది అంటే అతిశయోక్తి మాత్రం కాదు. 


టెక్‌టాక్ ‌A TO Z

జియోఫోన్‌ నెక్ట్స్‌: టెక్‌ దిగ్గజాలు రిలయన్స్‌ జియో, గూగుల్‌ కలిసి  జియోఫోన్‌ నెక్ట్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్ణయించాయి. ఎంట్రీ స్థాయి వినియోగదారులకు బాగుంటుంది. కస్టమ్‌ ఔస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ రేటు కొనుగోలుదారులకు ఊహలకు తగ్గట్టు ఉంటుందా అన్నది అనుమానమే.

టెక్‌టాక్ ‌A TO Z

 


క్రాఫ్టన్‌: పబ్జీకి కొత్త అవతారమని చెప్పుకోవచ్చు. బ్యాటిల్‌ గ్రౌండ్స్‌    మొబైల్‌ ఇండియా సృష్టి ఇది. భారతీయ కుటుంబాల్లో పాపులర్‌ గేమ్‌ యాప్‌గా పేరొందింది. 

ఒన్‌ ప్లస్‌ ఒప్పో మెర్జర్‌: ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగాలని నిర్ణయించినప్పటికీ కార్యకలాపాలకు సంబంధించి ఒప్పోతో కలిసి పనిచేయనున్నట్టు వన్‌ప్లస్‌ అధికారికంగానే ప్రకటించింది. అయితే ఈ విలీనం రెండు బ్రాండ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది వేచి చూడాలి. 

లాగ్‌4జె: సైబర్‌ సెక్యూరిటీపరంగా ఈ ఏడాది సీరియస్‌ ముప్పు కలిగించింది. ఇంటర్నెట్‌ సర్వీస్‌, అప్లికేషన్‌కు ముప్పుకలిగించింది. ట్విట్టర్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సహా అన్నింటికీ శత్రువుగానే మారింది. 

మెటా: చిరపరిచితమైన ఫేస్‌బుక్‌ కాస్తా మెటాగా మారింది. ఈ విషయంలో ప్రచారంలో ఉన్నది ఇది జుకెర్‌బర్గ్‌ కల. కాగా, నిజం ఫేస్‌బుక్‌కు ఉన్న నెగెటివిటీని తొలగించుకోవడం. 

ఎన్‌ఎఫ్‌టి: దీని సృష్టి లేదా కొనుగోలు ఈ ఏడాది ట్రెండింగ్‌ యాక్టివిటీగా నిలిచింది. హాలీవుడ్‌, బాలీవుడ్‌, ఫుట్‌బాల్‌ సహా అన్నింటికీ పాకింది. డిజిటల్‌ లెగసీకి ఆరాటం ఎక్కువైంది. 2022లో ఎన్‌ఎఫ్‌టి ఫెయిర్‌(ప్రదర్శన) జరగబోతోంది. ఈ లోపే దీని భవితవ్యం తేలనుంది. 

పరాగ్‌ అగర్వాల్‌: ట్విట్టర్‌ కొత్త సీఈఓ ఈయనే. బాంబే ఐఐటీ గ్రాడ్యుయేట్‌. సిలికాన్‌ వ్యాలీలో అతిపెద్ద సంస్థ ట్విట్టర్‌కు నేతృత్వం వహిస్తున్న మరో ఇండియన్‌ ఈయన.

క్విట్‌ క్విట్‌ క్విట్‌: 2021లో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం మంత్ర మాదిరిగా ఉంది. ఉద్యోగాలు వదిలిపెట్టడం అందునా టెక్‌ కంపెనీల్లో ట్రెండింగ్‌ విషయంగా రాజీనామా మారింది. వివిధ కారణాలతో పలువురు తాము పని చేస్తున్న సంస్థలను విడిచి పెడుతున్నారు.

రియల్‌మి: ఇండియన్‌ మార్కెట్‌లో  శాంసంగ్‌ను తలదన్నింది. రెండో అతిపెద్ద బిగ్‌ ప్లేయర్‌గా అవతరించింది. పోకో, మియామీ కలిపి లెక్కించకుంటే ప్రథమ స్థానంలో రియల్‌మి ఉంటుంది. 

సోమెనీ(పలు) వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌: నిజంగానే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ మార్కెట్‌ను ముంచెత్తాయి. ఈ  ఏడాది వారానికి నాలుగు కంపెనీలకు చెందిన ఇయర్‌బడ్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. వాస్తవానికి 2020లోనే వీటి విజృంభణ ఉంటుందని భావించారు. అయితే అది ఒక ఏడాది ఆలస్యంగా నమోదైంది. అంతే తేడా.

ద స్పేస్‌ రేస్‌: జోకులు అన్నింటిని పక్కన పెడితే స్పేస్‌ ట్రావెల్‌, వాటి మధ్య పోటీ నిజం కాబోతోంది. జెఫ్‌ బైజోస్‌, ఎలన్‌ మస్క్‌, రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ తదితరలు అంతరిక్ష యానాన్ని వాస్తవికం చేశారు. స్పేస్‌ ట్రావెల్‌, ఎక్స్‌ప్లొరేషన్‌ని రియాల్టీ చేశారు.

యూనికార్న్స్‌: ఈ ఏడాది మొత్తం భారత దేశానికి చెందిన పలు స్టార్టప్‌ కంపెనీలు యూనికార్న్‌ క్లబ్‌లో చేరాయి. వీటి విలువ ఒక బిలియను డాలర్లు. మొత్తమ్మీద ఎక్కువ స్టార్టప్‌లు యూనికార్న్‌ హోదాను పొందాయి. నిజానికి ఆర్థిక కోణంలో చూసుకుంటే భారతదేశానికీ చాలా సంక్లిష్టమైన సంవత్సరం.

 వర్చ్యుయల్‌ రియాల్టీ 2.0: ఏఆర్‌తో కలిసిన వీఆర్‌ రాబోయే రోజుల్లో అతిపెద్ద టెక్నాలజీగా అవతరించనుంది. యాపిల్‌, మెటా, శాంసంగ్‌, మైక్రోసాఫ్ట్‌ వీఆర్‌కు సంబంధించి ప్రొడక్ట్‌లను తీసుకురావడంలో ఇప్పటికే బిజీగా ఉన్నాయి. 

వెబ్‌కామ్స్‌: వెబ్‌కామ్‌ నుంచి తప్పించుకోవడం ఈ ఏడాది సాధ్యం కాలేదు. 

జూమ్‌, గూగుల్‌ మీట్‌ సహా తతిమా 

వాటిల్లో పాల్గొనేందుకు కంప్యూటర్‌పై వెబ్‌కామ్‌ సర్వసాధారణమైంది. 

యు హావ్‌ గాట్‌ స్పామ్‌: భారత దేశంలో ప్రతి నిమిషానికి ఒకరు చొప్పున స్పామ్‌ కాల్‌, మెసేజ్‌ లేదంటే వాట్సాప్‌ మెసేజ్‌కు బాధితులు అవుతున్నారు. ఈ విషయంలో ప్రపంచంలోనే నాలుగో దేశంగా మారింది. 

జీరో డే: సాఫ్ట్‌వర్‌, హార్డ్‌వేర్‌కు ముప్పుకలిగిస్తూ ఉంటుంది. జీరో డే థ్రెట్స్‌ పాపులర్‌ కాకున్నప్పటికీ అందరికీ తెలుసు. వినియోగదారులు, ఆర్గనైజేషన్లు దీని భారినపడ్డారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకం Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.