తొగుట మార్కెట్‌యార్డులో అన్నదాతల కన్నీరు

ABN , First Publish Date - 2022-05-16T05:27:31+05:30 IST

తొగుట మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన కురిసిన భారీ వర్షం రైతులకు కడగండ్లు మిగిల్చింది. తొగుట మార్కెట్‌యార్డులో 12 ట్రాక్టర్‌ ట్రిప్పుల ధాన్యం నీటి పాలైందని అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు. మార్కెట్‌యార్డుకు ధాన్యం తీసుకొచ్చిన తొగుట గ్రామానికి చెందిన కాసార్ల శివరాం మల్లయ్యకు చెందిన 3 ట్రాక్టర్‌ ట్రిప్పుల ధాన్యం, ఎర్రోళ్ల నర్సయ్యకు చెందిన 5 ట్రాక్టర్లు, పయ్యావుల సురే్‌షకు చెందిన 2 ట్రాక్టర్లు, వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన పాత్కుల పెంటయ్యకు చెందిన 2 ట్రాక్టర్‌ ట్రిప్పుల ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.

తొగుట మార్కెట్‌యార్డులో అన్నదాతల కన్నీరు
ధాన్యం కొట్టుకుపోవడంతో రోదిస్తున్న రైతులు

పన్నెండు ట్రాక్టర్ల ధాన్యం నీటిపాలు

మల్లన్నసాగర్‌ కట్టపై నుంచి వచ్చిన నీటితోనే కొట్టుకుపోయిందని ఆందోళన

రైతులతో కలిసి కాంగ్రెస్‌, బీజేపీ నేతల ధర్నా


తొగుట, మే 15: తొగుట మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన కురిసిన భారీ వర్షం రైతులకు కడగండ్లు మిగిల్చింది. తొగుట మార్కెట్‌యార్డులో 12 ట్రాక్టర్‌ ట్రిప్పుల ధాన్యం నీటి పాలైందని అన్నదాతలు  కన్నీరుమున్నీరయ్యారు. మార్కెట్‌యార్డుకు ధాన్యం తీసుకొచ్చిన తొగుట గ్రామానికి చెందిన కాసార్ల శివరాం మల్లయ్యకు చెందిన 3 ట్రాక్టర్‌ ట్రిప్పుల ధాన్యం, ఎర్రోళ్ల నర్సయ్యకు చెందిన 5 ట్రాక్టర్లు, పయ్యావుల సురే్‌షకు చెందిన 2 ట్రాక్టర్లు, వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన పాత్కుల పెంటయ్యకు చెందిన 2 ట్రాక్టర్‌ ట్రిప్పుల ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం ఆధ్వర్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు పెద్దసంఖ్యలో మార్కెట్‌ వద్దకు చేరుకొని రైతులకు సంఘీభావం పలికి మార్కెట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ధాన్యం కొట్టుకు పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ కట్టపై నుంచి వచ్చిన నీటిని మార్కెట్‌యార్డులోకి తరలించడం వల్లనే ధాన్యం కొట్టుకుపోయిందని వారు ఆరోపించారు. వెంటనే అధికారులు మల్లన్నసాగర్‌ నీటిని మార్కెట్‌ వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇరు పార్టీల నేతల ధర్నాతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తొగుట ఎస్‌ఐ కర్ణాకర్‌రెడ్డి పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని నేతలకు నచ్చజెప్పారు. కలెక్టర్‌, ఆర్డీవో వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని వారు భీష్మించుకు కూర్చున్నారు. దాంతో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనిత అక్కడికి చేరుకొని ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడింది. వడ్లు కొట్టుకుపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా చూస్తామని ఎంపీ హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. దాంతో వారు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని చైర్‌పర్సన్‌ను నిలదీశారు. దాంతో పోలీసులు వెంటనే ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ ధర్నాలో నాయకులు నరేందర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనాకర్‌రెడ్డి, చిక్కుడు చంద్రం, విభీషన్‌రెడ్డి, స్వామిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, తిరుపతి, నరేష్‌, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T05:27:31+05:30 IST