కరోనాతో మిర్చి రైతుల కంట్లో కన్నీరు

ABN , First Publish Date - 2020-04-04T22:43:03+05:30 IST

మిర్చి రైతుల కంట్లో కరోనా మంట పెడుతోంది. మాయదారి వైరస్ కారణంగా రైతులు, రైతు కూలీలు పొలాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది

కరోనాతో మిర్చి రైతుల కంట్లో కన్నీరు

గుంటూరు : మిర్చి రైతుల కంట్లో కరోనా మంట పెడుతోంది. మాయదారి వైరస్ కారణంగా రైతులు, రైతు కూలీలు పొలాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఒకవేళ వెళ్లినా కోయకముందే మిర్చి కన్నీరు పెట్టిస్తోంది. ఒకవేళ కోసినా అమ్ముకునే దారే కనిపించడం లేదు. కోసే నాథుడు లేకపోవడంతో చెట్లపైనే మిర్చి ఎండిపోతోంది. ఒకవేళ పనులకు ఎవరన్నా వచ్చినా సరే, రెండింతల కూలీ అడుగుతున్నారు. రెండితలు చెల్లించలేని రైతులు వాటిని పొలంలోనే వదిలేస్తున్నారు. దీంతో తాము పెట్టిన పెట్టుబడులు తిరిగి రావని, ఏం చేయాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. 

Updated Date - 2020-04-04T22:43:03+05:30 IST