కడప: ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర షర్మిల కన్నీటి పర్యంతమైయ్యారు. రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో..వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించేందుకు షర్మిల, విజయలక్ష్మిఇడుపులపాయకు వెళ్లారు. నివాళులర్పించిన అనంతరం తల్లీకూతుళ్లు భావోధ్వేగానికి గురైయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని షర్మిల, విజయలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు.