Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 16 May 2022 20:35:33 IST

Actor గా మారనున్న క్రికెటర్.. ఈ ఏడాదే విడుదల కానున్న సినిమా..

twitter-iconwatsapp-iconfb-icon

తనపై వేటు పడ్డ ప్రతిసారి గొప్పగా పునరాగమనం చేస్తూ సత్తా చాటుకున్న టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్(Shikhar Dhawan). ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఓపెనర్‌గా అభిమానులందరికీ సుపరిచితుడే. అతడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే మూవీ షూటింగ్‌ను కూడా పూర్తి చేశాడట. కానీ, ఆ సినిమా పేరు ఏంటో మాత్రం తెలియడం లేదు. 


శిఖర్ ధావన్‌కు నటులంటే చాలా గౌరవం, బాలీవుడ్ స్టార్ హీరోలతోను పరిచయం ఉంది. ‘‘ఓ సినిమాలో నటించమని శిఖర్‌కు ఆఫర్ వచ్చింది. చిత్రంలోని పాత్రకు అతడు సరిగ్గా సరిపోతాడని మేకర్స్ భావించారు. కొన్ని నెలల క్రితమే సంప్రదించారు. అందుకు సంతోషంగా అంగీకారం తెలిపాడు. ప్రాజెక్టులో అతడిది కీలక పాత్ర. ఈ ఏడాది ఎప్పుడయినా ఆ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది’’ అని శిఖర్ ధావన్‌తో సన్నిహితంగా మెలిగేవారు తెలిపారు. అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటించిన ‘రామ్‌సేతు’ (Ram Setu) సెట్లో గతేడాది అక్టోబర్‌లో శిఖర్ ధావన్ కనిపించాడు. దీంతో ఈ చిత్రంలో అతడు నటించనున్నాడని పుకార్లు షికార్లు కొట్టాయి. కానీ, ఈ మూవీలో టీమిండియా క్రికెటర్ నటించలేదని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే అక్షయ్ కుమార్, శిఖర్ ధావన్ చాలా కాలంగా మంచి స్నేహితులు. ఆ పరిచయంతోనే ఈ సినిమా సెట్‌కు అతడు వచ్చాడు. బాలీవుడ్ యువనటుడు రణ్‌వీర్ సింగ్(Ranveer Singh)తో కూడా స్టార్ క్రికెటర్‌కు పరిచయముంది. అతడు గతేడాది డిసెంబర్‌లో రణ్‌వీర్‌తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ పిక్ కింద క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘‘నిన్ను కలసినందుకు సంతోషంగా ఉంది. ‘83’ సినిమా భారీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన చిత్రాన్ని చూసి నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను’’ అని శిఖర్ తెలిపాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement