Abn logo
Sep 22 2021 @ 03:55AM

మిథాలీ మళ్లీ నెం.1

దుబాయ్‌: టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. తాజా వన్డే ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో మిథాలీ 762 రేటింగ్‌ పాయింట్లతో లిజెల్‌ లీ (దక్షిణాఫ్రికా)ని వెనక్కినెట్టి రెండు నుంచి నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరింది. బౌలింగ్‌ విభాగంలో జులన్‌ గోస్వామి ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. జెస్‌ జాన్సెన్‌ (ఆస్ట్రేలియా), మెగాన్‌ షుట్‌ (దక్షిణాఫ్రికా) టాప్‌-2లో ఉన్నారు.