విలియమ్సన్ కెప్టెన్సీపై కోహ్లీ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2020-02-03T00:55:46+05:30 IST

న్యూజిలాండ్ జట్టు సారథి కేన్ విలియమ్సన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సిరీస్ కంటే

విలియమ్సన్ కెప్టెన్సీపై కోహ్లీ ప్రశంసల జల్లు

మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్ జట్టు సారథి కేన్ విలియమ్సన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సిరీస్ కంటే ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో కివీస్ ఓటమి పాలైంది. తాజాగా, భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-5తో వైట్ వాష్ అయింది. దీంతో ఆ జట్టు అభిమానులు, విశ్లేషకులు విలియమ్సన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, కోహ్లీ మాత్రం విలియమ్సన్‌కు మద్దతుగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. తమ ఇద్దరిదీ ‘ఒకే రకమైన మైండ్‌సెట్’ అని పేర్కొన్నాడు. ప్రపంచంలో ఇద్దరం వేర్వేరు ప్రాంతాల వారమైనా ఇద్దరి ఆలోచనా విధానం మాత్రం ఒకేటనని అన్నాడు. ఇద్దరం ఒకేలా మాట్లాడతామని పేర్కొన్నాడు. 


న్యూజిలాండ్ క్రికెట్ ప్రస్తుతం అత్యుత్తమ వ్యక్తి చేతుల్లోనే ఉందని, జట్టును ముందుకు నడిపించేందుకు విలియమ్సన్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు. జట్టును నడిపించడానికి అతడు సమర్థుడైన వ్యక్తి అని భావిస్తున్నట్టు చెప్పిన కోహ్లీ.. భవిష్యత్తులోనూ అతడు జట్టుకు సారథ్యం వహించాలని కోరుకుంటూ బెస్టాఫ్ లక్ చెప్పాడు. 

Updated Date - 2020-02-03T00:55:46+05:30 IST