బోణీ ఘనంగా..

ABN , First Publish Date - 2022-07-30T09:36:54+05:30 IST

ఐదు టీ20ల సిరీ్‌సను టీమిండియా అదిరిపోయే రీతిలో ఆరంభించింది. రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు సూపర్‌ ఫినిషర్‌ దినేశ్‌ కార్తీక్‌..

బోణీ ఘనంగా..

భారత్‌దే తొలి టీ20

రోహిత్‌ హాఫ్‌ సెంచరీ

దినేశ్‌ కార్తీక్‌ మెరుపు ఇన్నింగ్స్‌ 

టరౌబా (ట్రినిడాడ్‌): ఐదు టీ20ల సిరీ్‌సను టీమిండియా అదిరిపోయే రీతిలో ఆరంభించింది. రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు సూపర్‌ ఫినిషర్‌ దినేశ్‌ కార్తీక్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్‌) మెరుపులతో భారీ స్కోరు సాధించిన భారత్‌.. ఆ తర్వాత బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఆతిథ్య వెస్టిండీస్‌ కుదేలైంది. దీంతో శుక్రవారం జరిగిన ఈ తొలి టీ20లో రోహిత్‌ సేన 68 పరుగుల తేడాతో ఘనవిజయంతో పాటు సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టీ20 సోమవారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెరీర్‌లో తొలి టీ20 ఆడిన పేసర్‌ జోసె్‌ఫకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసి ఓడింది. బ్రూక్స్‌ టాప్‌ స్కోరర్‌. అర్ష్‌దీప్‌, అశ్విన్‌, బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా దినేశ్‌ కార్తీక్‌ నిలిచాడు.


పోరాటమే లేదు..:

భారీ ఛేదనలో విండీస్‌ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. వేగంగా ఆడే క్రమంలో పవర్‌ప్లేలోనే టాపార్డర్‌ను కోల్పోయి ఒత్తిడిలో పడింది. 6,4తో జోరు మీద కనిపించిన ఓపెనర్‌ మేయర్స్‌ (15)ను అర్ష్‌దీప్‌ రెండో ఓవర్‌లోనే అవుట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో దిగిన హోల్డర్‌ను జడేజా డకౌట్‌ చేయగా.. మరో ఓపెనర్‌ బ్రూక్స్‌ (20)ను భువనేశ్వర్‌ అవుట్‌ చేశాడు. ఇక మిడిలార్డర్‌ను స్పిన్నర్లు బిష్ణోయ్‌, అశ్విన్‌ వరుస ఓవర్లలో దెబ్బతీయడంతో  కెప్టెన్‌ పూరన్‌ (18), పోవెల్‌ (14), హెట్‌మయెర్‌ (14), స్మిత్‌ (0) 20 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. అప్పటికి స్కోరు 86/7 మాత్రమే కావడంతో విండీస్‌ ఇక చేసేదేమీ లేకపోయింది. టెయిలెండర్‌ కీమో పాల్‌ (19 నాటౌట్‌) చివర్లో కాస్త వేగం ప్రదర్శించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.


ఆరంభంలో రోహిత్‌..

ఆఖర్లో డీకే: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ ఒంటరి పోరాటం చేయగా.. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ జోరు కారణంగా భారీ స్కోరు సాధ్యమైంది. విండీస్‌ వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ మిడిలార్డర్‌ను కట్టడి చేసింది. అంతకుముందు సూర్యకుమార్‌ (24)ను ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశ్చర్యపరిచింది. అతను ఐదో ఓవర్‌లోనే హోల్డర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే శ్రేయాస్‌ (0) డకౌట్‌ కావడంతో పాటు పంత్‌ (14) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. మరోవైపు రోహిత్‌ 35 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఈ దశలో ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ (1) కూడా విఫలం కావడంతో జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. అటు వేగంగా ఆడే క్రమంలో రోహిత్‌ భారీ షాట్‌ ఆడాలని చూసి డీప్‌ కవర్‌లో హెట్‌మయెర్‌ క్యాచ్‌తో నిష్క్రమించాడు. అయితే 16వ ఓవర్‌లో జడేజా (16)ను అవుట్‌ చేసిన విండీస్‌ డెత్‌ ఓవర్లలోనూ కట్టుదిట్టంగానే కనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లలో అశ్విన్‌ (13 నాటౌట్‌) అండతో దినేశ్‌ కార్తీక్‌ చెలరేగాడు. 19వ ఓవర్‌లో అశ్విన్‌ 6, డీకే 6,4తో 21 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లోనూ బ్యాట్‌ ఝుళిపించిన డీకే 6,4,4తో 15 రన్స్‌ రాబట్టడంతో ఏడో వికెట్‌కు అజేయంగా 25 బంతుల్లోనే 52 పరుగులు రావడం విశేషం. 


స్కోరు బోర్డు

భారత్‌:

రోహిత్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) హోల్డర్‌ 64, సూర్యకుమార్‌ (సి) హోల్డర్‌ (బి) హోసేన్‌ 24, శ్రేయాస్‌ (సి) హోసేన్‌ (బి) మెకాయ్‌ 0, రిషభ్‌ (సి) హోసేన్‌ (బి) పాల్‌ 14, హార్దిక్‌ (సి) మెకాయ్‌ (బి) జోసెఫ్‌ 1, రవీంద్ర జడేజా (సి) పాల్‌ (బి) జోసెఫ్‌ 16, దినేశ్‌ (నాటౌట్‌) 41, అశ్విన్‌ (నాటౌట్‌) 13, ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం 20 ఓవర్లలో 190/6. వికెట్ల పతనం: 1-44, 2-45, 3-88, 4-102, 5-127, 6-138. బౌలింగ్‌: మెకాయ్‌ 4-0-30-1, హోల్డర్‌ 4-0-50-1, హోసేన్‌ 4-0-14-1, జోసెఫ్‌ 4-0-46-2, ఒడీన్‌ స్మిత్‌ 2-0-18-0, పాల్‌ 2-0-24-1.


వెస్టిండీస్‌:

మేయర్స్‌ (సి) భువనేశ్వర్‌ (బి) అర్ష్‌దీప్‌ 15, బ్రూక్స్‌ (బి) భువనేశ్వర్‌ 20, హోల్డర్‌ (బి) జడేజా 0, పూరన్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 18, పావెల్‌ (బి) బిష్ణోయ్‌ 14, హెట్‌మయెర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అశ్విన్‌ 14, హోసేన్‌ (బి) అర్ష్‌దీప్‌ 11, స్మిత్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) బిష్ణోయ్‌ 0, పాల్‌ (నాటౌట్‌) 19, జోసెఫ్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం 20 ఓవర్లలో 122/8. వికెట్ల పతనం: 1-22, 2-27, 3-42, 4-66, 5-82, 6-86, 7-86, 8-101. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-1-11-1, అర్ష్‌దీప్‌ 4-0-24-2, రవీంద్ర జడేజా 4-0-26-1, అశ్విన్‌ 4-0-22-2, హార్దిక్‌ 2-0-12-0, రవి బిష్ణోయ్‌ 4-0-26-2.

Updated Date - 2022-07-30T09:36:54+05:30 IST