ఓ ఇంటివాడైన టీమిండియా ఆల్‌రౌండర్

ABN , First Publish Date - 2021-07-17T07:03:44+05:30 IST

టీమిండియా ఆల్‌రౌండర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శివం దూబే ఓ ఇంటివాడయ్యాడు. తన లాంగ్ టైం ప్రేయసి అంజుమ్ ఖాన్‌ను శుక్రవారం..

ఓ ఇంటివాడైన టీమిండియా ఆల్‌రౌండర్

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శివం దూబే ఓ ఇంటివాడయ్యాడు. తన లాంగ్ టైం ప్రేయసి అంజుమ్ ఖాన్‌ను శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. 29ఏళ్ల శివం దూబే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ ఫోటోలకు ‘మేమిద్దరం ప్రేమగా ప్రేమించుకున్నాం. అది ప్రేమకంటే ఎన్నో రెట్లు గొప్పది. ఇక ఇప్పుడు మా కొత్త జీవితం ప్రారంభం కానుంది’ అని ట్యాగ్ లైన్ ఇచ్చాడు. కాగా.. దూబే భారత్ తరపున ఓ వన్డే, 13 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున ఆడిన శివం దూబే, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగాడు.



Updated Date - 2021-07-17T07:03:44+05:30 IST