ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ మహిళలకు ‘ప్రత్యేక బహుమతి’

ABN , First Publish Date - 2022-04-04T21:32:40+05:30 IST

ఐసీసీ మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాకు స్వదేశంలో అద్వితీయ స్వాగతం లభించింది..

ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ మహిళలకు ‘ప్రత్యేక బహుమతి’

క్రైస్ట్‌చర్చ్: ఐసీసీ మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాకు స్వదేశంలో అద్వితీయ స్వాగతం లభించింది. అలాగే, జట్టు సభ్యులు ‘ప్రత్యేక బహుమతులు’ కూడా అందుకున్నారు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఏడోసారి ప్రపంచకప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనింగ్ బ్యాటర్ అలిస్సా హీలీ చెలరేగింది. 138 బంతుల్లో 26 ఫోర్లతో 170 పరుగులు చేసి ఆసీస్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించింది.


ప్రపంచకప్ గెలుచుకుని స్వదేశంలో అడుగుపెట్టిన మెగ్ లానింగ్ సేనకు అద్భుత స్వాగతం లభించింది. అలాగే, ప్రపంచకప్‌లో వారి అద్భుతమైన ప్రదర్శనకు గాను ‘ప్రత్యేక బహుమతి’ లభించింది. ఈ మేరకు జట్టు సభ్యులు ‘సంప్రదాయ మావోరి గిఫ్ట్’లు అందుకుంటున్న ఫొటోలను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.  

Updated Date - 2022-04-04T21:32:40+05:30 IST