స్నేహితుడి బ్లాక్‌మెయిలింగ్‌.. యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-24T17:37:12+05:30 IST

స్నేహితుడి బ్లాక్‌మెయిలింగ్‌.. యువకుడి ఆత్మహత్యాయత్నం

స్నేహితుడి బ్లాక్‌మెయిలింగ్‌.. యువకుడి ఆత్మహత్యాయత్నం

పెళ్లికి రూ.10లక్షల సాయం.. అయినా వేధింపులు 

ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కం


హైదరాబాద్‌ : ఆ యువకుల పరిచయం స్వలింగ సంపర్కానికి దారి తీసింది. అందులో ఒకడికి పెళ్లి నిశ్చయం కావడంతో.. మరో స్నేహితుడు రూ. పది లక్షలు ఆర్థిక సహాయం చేశాడు. ఇదే అదునుగా ఇంకా డబ్బు కావాలని స్నేహితుడిని అతడు బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. శాలిబండ పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ యువకుడి భార్య 2017లో మరణించింది. ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పే అతడికి సమీపంలోని బస్తీలో ఉండే యువకుడు పరిచయమయ్యాడు. యువతిలా వస్త్రధారణతో అతడిని ఆకర్షించేవాడు. అది క్రమంగా వారి మధ్య స్వలింగ సంపర్కానికి దారి తీసింది. కొద్ది రోజుల తర్వాత భార్య చనిపోయిన యువకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా స్నేహితుడితో స్వలింగ సంపర్కం మానలేదు. దీంతో భార్య వదిలి వెళ్ళిపోయింది. స్కలింగ సంపర్కుల్లో మరో యువకుడికి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం నిశ్చయమైంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అతడికి స్నేహితుడు (భార్య వదిలేసిన యువకుడు) రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేశాడు. ఇదే అదునుగా అతను ఇంకా డబ్బు కావాలని బెదిరించడం మొదలుపెట్టాడు. లేదంటే ఇద్దరూ కలిసిన వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించసాగాడు. దీంతో బాధితుడు మొగల్‌పురా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ వివాహం నిశ్చయమైన యువకుడు బెదిరింపులు ఆపలేదు. మనస్తాపానికి గురైన స్నేహితుడు (భార్య వదిలేసిన యువకుడు) మంగళవారం అర్ధరాత్రి 100కు, 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2022-06-24T17:37:12+05:30 IST