ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం

ABN , First Publish Date - 2022-08-07T05:39:11+05:30 IST

సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి పేర్కొన్నారు.

ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం
విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న న్యాయమూర్తి గోపి


 జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి

వమరవిల్లి (గార), ఆగస్టు 6:
సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శనివారం వమరవిల్లి డైట్‌లో జిల్లాన్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించబోతున్న ఛాత్రోపాధ్యాయులంతా ఆ వృత్తికి మరింత గౌరవాన్ని తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే  బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.  జిల్లాన్యాయసేవాధికార సంస్థ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని, బాగా చదువుకొని మంచి ఉన్నతస్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. డైట్‌ ప్రిన్సిపాల్‌ తిరుమల చైతన్య మాట్లాడుతూ..  న్యాయమూర్తులు అందించిన ఎంతో విలువైన సమాచారం విద్యార్థుల బావిజీవితానికి మేలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు న్యాయమూర్తులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డైట్‌ అధ్యాపకులు ఎం.భారతమ్మ, నాయుడు, ఇతర అధ్యాపకులు, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-07T05:39:11+05:30 IST