ఆడుతూ.. పాడుతూ.. విద్యాబోధన

ABN , First Publish Date - 2021-12-07T16:47:04+05:30 IST

పాఠశాలకు రావడంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు పలు కార్య క్రమాలు చేపడుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 19 నెలలు పాఠశాలలు మూతపడడంతో విద్యార్థులు ఇంటికే

ఆడుతూ.. పాడుతూ.. విద్యాబోధన

పెరంబూర్‌(చెన్నై): పాఠశాలకు రావడంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 19 నెలలు పాఠశాలలు మూతపడడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభించినా విద్యార్థులు పూర్తిగా హాజరుకావడం లేదు. దీంతో, విద్యార్థులు పాఠశాలకు రావడంపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా మామండూర్‌ మధ్యామిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కవిత, తరగతి ప్రారంభించిన కొద్దిసేపు తమిళ పాటలు పాడుతూ విద్యార్థులతో కలసి నాట్యం చేస్తుంది. దీంతో, విద్యార్థులు కూడా ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగిందని టీచర్‌ కవిత ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-07T16:47:04+05:30 IST