Abn logo
Jun 23 2021 @ 23:57PM

ఉపాధ్యాయులు నేటి నుంచి స్కూళ్లకు వెళ్లాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

హరితహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ఈ సంవత్సరం విద్యాశాఖ 5 లక్షల మొక్కలు నాటాలి

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు


మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌), జూన్‌ 23: వచ్చే నెల 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవు తున్న దృష్ట్యా ఉపాధ్యాయులంతా పాఠశాలలకు గురువారం నుంచే వెళ్లాలని కలెక్టర్‌ ఎస్‌.వెంక ట్రావు విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, హరిత హారం మొక్కలు నాటడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం నేప థ్యంలో కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ కారణం గా ఇన్ని రోజులు పాఠశాలలు నిర్వహించలేదని, పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఉపాధ్యా యులు నిర్లక్ష్యం వహించకుండా తప్పని సరిగా పాఠశాలలకు హాజరుకావాలని చెప్పారు. వచ్చే నెల వరకు ఎలాంటి సెలవులు పెట్టొద్దని చెప్పారు. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ పాఠ శాలలో మాస్క్‌లు, శానిటైజర్లు తప్పని సరిగా ఉంచాలన్నారు. అందుకు దాతల సహకారం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజారోగ్య శాఖ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల న్నారు. మధ్యాహ్న భోజనంపై ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఏజెన్సీలతో స్కూల్‌ కాంప్లెక్స్‌, పాఠశాల స్థాయి సమావేశాలు నిర్వహిం చాలన్నారు. ఈ సమావేశాలకు గ్రామ సర్పంచు లను పిలవాలని, మండల స్థాయి సమావే శాలకు మెడికల్‌ అధికారులను పిలవాలని ఆదేశించారు. పాఠశాలలు తెరుస్తున్నందున పాఠశాలల్లో నిర్వహి స్తున్న ధాన్యం, సీడ్‌ బాల్స్‌, ఐసోలేషన్‌ కేంద్రా లను అక్కడి నుంచి తొలగించాలన్నారు. పరిశు భ్రతపై నిర్లక్ష్యం వహించినందుకు మహ్మదాబాద్‌ కేంద్ర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకో వాలని డీఈవోను ఆదేశించారు. ఈ సంవంత్సరం విద్యాశాఖకు 5 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా ఇస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు, గుబురు మొక్కలు నాటాలన్నారు. అన్ని కళాశాలల్లో మియావాకి తరహాలో మొక్కలు నాటాలన్నారు. బుధవారం సాయత్రం మండల స్థాయిలో, గురువారం గ్రామ స్థాయిలో పరిశుభ్రతపై సమావేశాలు నిర్వహించాలని చెప్పా రు. కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, డీఈవో ఉషారాణి, మునిసిపల్‌ శానిటరీ ఇన్‌స్పె క్టర్లు, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల ప్రినిపాల్స్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల జిల్లా కో-ఆర్డినేటర్లు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంఈవోలు, ఎంపీవోలు హాజరయ్యారు.