టీచర్ల క్రమబద్ధీకరణ ఉత్తర్వు 117ను సవరించాలి

ABN , First Publish Date - 2022-07-03T05:26:32+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూ తన జాతీయ విద్యా వి ధానం అమలు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన టీచర్ల క్రమబద్దీకరణ ఉత్తర్వు 117ను అమలు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాల వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని కావున టీచర్ల క్రమబద్దీకరణ ఉత్తర్వులు 117ను సవరించి వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఏపీటీఎఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

టీచర్ల క్రమబద్ధీకరణ ఉత్తర్వు 117ను సవరించాలి
మాట్లాడుతున్న శ్యామ్‌ సుందర్‌రెడ్డి

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌ సుందర్‌రెడ్డి  

కడప(ఎడ్యుకేషన), జూలై 2: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూ తన జాతీయ విద్యా వి ధానం అమలు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన టీచర్ల క్రమబద్దీకరణ ఉత్తర్వు 117ను అమలు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాల వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని కావున టీచర్ల క్రమబద్దీకరణ ఉత్తర్వులు 117ను సవరించి వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఏపీటీఎఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కడప నగరం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట శనివారం జరిగిన ఏపీటీఎఫ్‌ ముఖ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాం సుందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యా సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రభు త్వ పాఠశాలలకు నష్టం చేసేలా ఉపాధ్యాయ పోస్టులు పెద్ద సంఖఱ్యలో రద్దు అయ్యేలా క్రమబద్దీకరణ ఉత్తర్వులను జారీ చేశారన్నారు. క్రమబద్దీకరణ ఉత్తర్వులను వెంటనే సవరించి తాజా ఉత్తర్వులను విడుదల చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి రాష్ట్ర కౌన్సిలర్లు ఖాదర్‌ బాషా, జిల్లా కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, సుబ్బయ్య, చింతకొమ్మదిన్నె మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా కౌన్సిలర్లు, బాలజ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T05:26:32+05:30 IST