పీఆర్‌సీ తక్షణం అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-07-24T05:07:10+05:30 IST

ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేయాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా తాలుకా కేంద్రాల వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు.

పీఆర్‌సీ తక్షణం అమలు చేయాలి
ఆందోళన చేస్తున్న ఫ్యాప్టో నాయకులు

ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నాలు

గుంటూరు(విద్య), జూలై 23: ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేయాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా తాలుకా కేంద్రాల వద్ద  శుక్రవారం ఆందోళన నిర్వహించారు. గుంటూరు తాలుకా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనలో పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ రెండున్నరేళ్లు దాటినా  ఎన్నికల హామీలకు వాస్తవం రూపం రాలేదని ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఫ్యాప్టో   కార్యదర్శి కె.నరసింహారావు పేర్కొన్నారు. ఆందోళనలో సంఘం నాయకులు మేకల సుబ్బారావు, ఎం.కళాధర్‌, పెదబాబు, రాజా,  ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, సుకుమార్‌, దక్షణ భారత విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పి.నాగరాజు, వేళాంగిణిరాజు, పండిత పరిషత్‌ నాయకులు సాంబయ్య, సీపీఎస్‌ నాయకులు రత్తయ్య, కె.వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T05:07:10+05:30 IST