ఏంచేయాలి.. ఏం చేయిస్తున్నారు

ABN , First Publish Date - 2022-08-18T05:30:00+05:30 IST

‘ఉపాధ్యాయులు ఏం చేయాలి ? ఏం చేస్తున్నారు ? ఇది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్న. దీనికి సమాధానం ఎవరి వద్దా లేదు. ప్రభుత్వమే చెప్పాలి. నిజానికి పిల్లల మేధో వికాసానికి అవసరమైన చదువు చెప్పాలి.

ఏంచేయాలి.. ఏం చేయిస్తున్నారు

చదువులు చెప్పాలా ? ఆఫీసు పనులు చేయాలా ?.. ఒత్తిడిలో ఉపాధ్యాయులు

విద్యార్థులకు బూట్లు తీసుకువస్తూ రోడ్డు ప్రమాదంలో హెచ్‌ం దుర్మరణం

బోధనకంటే ఇతర పనుల వల్లే ఈ ఘటన జరిగిందని టీచర్ల ఆందోళన 


‘ఉపాధ్యాయులు ఏం చేయాలి ? ఏం చేస్తున్నారు ? ఇది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్న. దీనికి సమాధానం ఎవరి వద్దా లేదు. ప్రభుత్వమే చెప్పాలి. నిజానికి పిల్లల మేధో వికాసానికి అవసరమైన చదువు చెప్పాలి. వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. భవిష్యత్‌కు దిశా నిర్దేశం చేయాలి. కానీ ప్రభుత్వం వీరితో ఏం చేయిస్తోంది. అనేక విడతలుగా వచ్చే పుస్తకాలు తెచ్చుకునేందుకు, యూనిఫాం , బూట్లు, బెల్టులు, చివరికి చీపుళ్ళు, టాయిలెట్‌ క్లీనర్లు తెచ్చుకునేందుకు, వివిధ రిపోర్టులను ఆఫీసుల్లో అందించేందుకు, నాడు–నేడు పనులపై బ్యాంకులకు, ఇంజనీర్ల వద్దకు, చెక్‌లపై సంతకాల కోసం, వస్తువుల కొనుగోలు కోసం.. ఉపాధ్యాయులతో ఊపిరి సలపనంతగా వెట్టిచాకిరీ చేయిస్తోంది. ఈ విషయాలేవీ తెలియకుండా, తెలుసుకునే ప్రయత్నం చేయకుండా టీచర్లపై అక్కసు వెళ్లగక్కడం సరికాదు. ఈ రోజు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయుని మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమూ ఓ కారణమని చెప్పకుండా ఉండలేం. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు బాధ్యులే’ అంటూ ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 


ఏలూరు ఎడ్యుకేషన్‌/పెదవేగి, ఆగస్టు 18 : పెదవేగి మండ లం విజయరాయి స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని చింతల పాటివారిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జె.రాజశేఖర్‌ గురువారం స్కూలుకు సమీపంలోని లేళ్ళ గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెం దడంతో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో విషాద ఛాయ లు అలుముకున్నాయి. విగతజీవిగా రక్తపు మడుగులో రోడ్డుపై పడివున్న ప్రధానోపాధ్యాయుని మృతదేహం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, ప్రమాదానికి కారణాలపై టీచర్లు విస్తృతంగా చర్చించుకున్నారు. ఇద్ద రు ఉపాధ్యాయులు వున్న ఈ స్కూలులో హెచ్‌ఎం బా ధ్యతలు చూస్తున్న రాజశేఖర్‌ విధి నిర్వహణలో నిజాయి తీకి మారుపేరుగా ఉండేవా రు. హెచ్‌ఎం అకాల మృతి నేప థ్యంలో... ఉపాధ్యాయు లపై పెనుభారాన్ని మోపు తూనే మానసికంగా ఒత్తిళ్ల కు గురిచేస్తోన్న ప్రభుత్వ చర్యలను పలువురు టీచర్లు తూర్పారబట్టారు. వీడియో కాన్ఫరెన్సులకు, హెచ్‌ఎంల సమావేశాలకు, బియ్యం తెచ్చుకునేందుకు, గుడ్లు, చిక్కీల నిల్వలు లేనపుడు సమీప పాఠశాలల నుంచి అప్పుగా తెచ్చుకునేందుకు ఉపాధ్యాయులనే ఎడాపెడా వాడుకుంటున్నారని, ఈ పనులతో ఇక పాఠాలు చెప్పడానికి సమయం ఎక్కడుం టుందని ప్రశ్నిస్తున్నారు. వీటికితోడు ఆన్‌లైన్‌ పనుల నిమిత్తం నెట్‌ సెంటర్లకు, పుస్తకాలు మిగిలిపోతే వాటిని తిరిగి ఎమ్మార్సీల్లో అందజేసేందుకు, విద్యార్థులు ఎవరై నా స్కూలుకు గైర్హాజరైతే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి నచ్చజెప్పి ఒప్పించి బడికి తీసుకువచ్చే పనులు హెచ్‌ఎంలు, టీచర్లే చేయాల్సి రావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతు న్నారని చెబుతున్నారు. 

పాఠశాలల్లో ఉన్నప్పుడు వివిధ యాప్‌లలో ఫొటోలు, లెక్కలు అప్‌లోడ్‌ చేయడంలో ఉపాధ్యాయులు ఓ విధం గా కుస్తీలు పడుతున్నారని, వెబెక్స్‌ సమావేశాలు, యూ ట్యూబ్‌లో శిక్షణా తరగతులు, మధ్యాహ్న భోజన పథకం వినియోగించుకున్న విద్యార్థులు, మళ్ళీ వారిలో గుడ్డు తిన్న వారి వివరాలు, తినని వారి వివరాల నమోదు, వంట కార్మికులతో పాట్లు, ఎక్సెల్‌ షీట్లు, గూగుల్‌ ఫార్మ్‌ లు, ఇంకా ప్రభుత్వం చెప్పే వివిధ దినాలు, దినోత్సవాల నిర్వహణ, వాటి నివేదికల తయారీవంటి పనులతోనే సతమతవుతున్న హెచ్‌ఎంలు, టీచర్లకు బోధనా కార్య కలాపాలపై పూర్తిస్థాయిలో సమయాన్ని వెచ్చించేందుకు వీలుండటం లేదు. దీని ప్రభావం విద్యార్థుల చదువు లపై పడుతోంది. ఓవైపు రకరకాల పనుల వల్ల ఒత్తిడితో చాలా మంది కుటుంబానికి సమయం కేటాయిం చలేకపోతున్నారు. రాజశేఖర్‌ మృతిని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖాధికారులు పునరాలోచన చేసి, ఉపాధ్యా యులను అదనపు పనుల నుంచి తప్పించాలని నాయ కులు కోరుతున్నారు. విద్యార్థులకు అందించే బూట్లు, పుస్తకాల వంటివి ఒకేసారి ఇస్తే ఆటో వంటి వాహనంపై తీసుకెళ్తారని, కానీ దఫదఫాలుగా వస్తువు లను ఇస్తుండడంతో రవాణా భారాన్ని భరించలేక ప్రధానోపాధ్యాయులే ద్విచక్ర వాహనాలపై తీసుకె ళ్తున్నారన్నారు. 


రహదారి మరో కారణం..!

ప్రధానోపాధ్యాయుడు జక్కుల రాజశేఖర్‌ మృతికి రహదారి కూడా కారణమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బూట్లతో కూడి గోనె సంచి మూట ద్విచక్ర వాహనం ముందుభాగాన ఉండడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు అంచుకు వెళ్లింది. మార్జిన్‌ లోతుగా ఉండడంతో అంచున కోతకు గురై బైక్‌ అదుపు తప్పి రహదారిపై పడింది. సిమెంట్‌ రహదారి కావడం, అంచున ఎలాంటి మట్టి, కంకర వంటివి వేయకపోవడం కారణంగా బైక్‌ చక్రం అంచుకు వెళ్ళి అదుపుతప్పి వాహనంతో సహా మాస్టారు రోడ్డు పై పడిపోయారు. ఆ సమయంలో వెనుకే వస్తున్న ట్రాక్టర్‌ చక్రం మాస్టారు తలపై నుంచి వెళ్లడంతో ఆయన మృతి చెందారని లేళ్లగూడెం వాసులు చెప్పిన మాట.

మంత్రి బొత్స ఏమన్నారంటే..

విద్యాకానుక కిట్లను పాఠశాలకు తీసుకువస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ విజ యవాడలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయ ణతో జరిగిన చర్చల సందర్భంగా వినతి పత్రాన్ని అందజేసినట్టు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ తెలిపారు. తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మంత్రి హెచ్‌ఎం మృతి విషయాన్ని ముఖ్యమంత్రి వద్ద చర్చించి, ఆ కుటుం బానికి స్పెషల్‌ ఎక్స్‌గ్రేషియా ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని వివరించారు.


15 రోజుల గ్రేస్‌ పీరియడ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 18 : ముఖగుర్తింపు హాజరు పై నెలకొన్న సందిగ్దత, సాంకేతిక సమస్యలు వరుసగా మూ డో రోజు గురువారం కొనసాగాయి. జిల్లా ఉపాధ్యాయుల్లో 54 శాతం మంది సిమ్స్‌–ఏపీ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుని, అం దులో రిజిస్టర్‌ అయినట్టు విద్యాశాఖ అధికారికంగా ప్రకటిం చింది. ఇప్పటి వరకు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోని టీచర్లు ఇకపై అదేపంథాలో ఉండాలని ఫ్యాప్టో ఇచ్చిన పిలుపుతో ప లువురు ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ జోలికిపోలేదు. యాప్‌ పనితీరు, టీచర్ల ఆందోళనలపై గురువారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతల మధ్య జరిగిన చర్చల్లో 15 రోజులపాటు యాప్‌పై టీచర్లకు ట్రైనింగ్‌ పీరియడ్‌గా పరిగణిస్తామని వెసు లుబాటు ఇచ్చినట్టు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. వరుసగా మూడుసార్లు ఆలస్యంగా వచ్చి, నాలుగో దఫా కూడా ఆలస్య మైతే హాఫ్‌డే లీవుగా పరిగణిస్తామని, ఈ పద్ధతి గతంలో కూడా ఉన్నదేనని ఉన్నతాధికారులు చెప్పినట్టు వివరించాయి. 

Updated Date - 2022-08-18T05:30:00+05:30 IST