ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-08-11T07:42:39+05:30 IST

విద్య, విజ్ఞాన బోధనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, కళా, క్రీడారంగాల్లో ఉత్తమ శిక్షణతో విద్యార్థులను తీర్చి దిద్దుతున్న అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఎంపికచేసి, సత్కరించి, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జాతీయ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సేవా సంస్థ సర్వేజనా సుఖినోభవంతు స్థాపక అధ్యక్షుడు ఈఎ్‌సఎస్‌ నారాయణ మాష్టారు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

గవర్నర్‌పేట, ఆగస్టు 10 : విద్య, విజ్ఞాన బోధనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, కళా, క్రీడారంగాల్లో ఉత్తమ శిక్షణతో విద్యార్థులను తీర్చి దిద్దుతున్న అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఎంపికచేసి, సత్కరించి, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జాతీయ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సేవా సంస్థ సర్వేజనా సుఖినోభవంతు స్థాపక అధ్యక్షుడు ఈఎ్‌సఎస్‌ నారాయణ మాష్టారు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబరు 5 టీచర్స్‌డే పురస్కరించుకుని సెప్టెంబరు 11వ తేదీ హైదరాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పురస్కారాల ఎంపికకు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. టీచర్స్‌ వారి విద్యార్హతలు, బోధన, శిక్షణ అనుభవాల పూర్తి వివరాలు గల సర్టిఫికెట్స్‌, ఫొటోలు, పేపర్‌ కటింగ్‌లు, గతంలో పొందిన అవార్డుల వివరాలు జిరాక్స్‌ కాపీలతో పాటు 4 పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలను దరఖాస్తుకు జతచేసి సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి పంపాలని కోరారు. ఇతర వివరాలకు 96523 47207 నెంబరును సంప్రదించాలన్నారు.

Updated Date - 2022-08-11T07:42:39+05:30 IST