Abn logo
Sep 27 2021 @ 00:07AM

1100 స్కూళ్లలో టీచర్ల ఆత్మగౌరవ ఉద్యమం

ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ

అనంతపురం విద్య, సెప్టెంబరు 26: ఉపా ధ్యాయుల ఆత్మగౌరవ ఉద్య మం రాష్ట్ర వ్యాప్తంగా 1,100 స్కూ ళ్లలో నిర్వహించినట్టు ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు హరి కృష్ణ పేర్కొన్నారు. మొదటి దశలో ఉద్యమం విజయవం తమైందన్నారు. ఆదివారం ఉపాధ్యాయభవన్‌లో  స మా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో  నల్లబ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డుల రూపంలో ఉద్య మం చేశారన్నారు. టీచర్ల ఆత్మగౌరవం నిలబెట్టుకుంటా మని తెలిపారు. ఉద్యోగోన్నతులు సాధించేదాకా ఉద్యమం ఆగదన్నారు. జూనియర్‌ లెక్చరర్లు, డీవైఈఓలు, డీఈఓ, పీఓ, ఏపీఓ ఉద్యోగోన్నతులు బోధనా వర్గానికే చెందాల్సి ఉందన్నారు. టీచర్లకు జేఎల్‌ ప్రమోషనలు ఇవ్వాలన్నారు. బోధనేతర సిబ్బంది జేఎల్‌ ప్రమోషనకి అర్హులైనప్పుడు విశేషానుభవం ఉన్న టీచర్లు అర్హులు కాదా అని ఆయన ప్రశ్నించారు. బోధనా రంగం వారికి దక్కాల్సిన పోస్టుల్లో ఇతరులను కూర్చోబెట్టడం సబబుకాదన్నారు.  కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆదిశేషయ్య, పీఎస్‌ హెచఎం అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధానకార్యదర్శి గోవిందరెడ్డి, డీటీఏ జిల్లా అధ్యక్షుడు పెద్దన్న, ప్రధానకార్యదర్శి పీటీ రెడ్డి, ఇతర నాయకులు శోభామణి, భవాని, పావని, రామచంద్ర, విజయలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.