పిల్లల ముందే కొట్టుకున్న ఉపాధ్యాయులు.. దేని గురించో తెలిస్తే షాక్..!

ABN , First Publish Date - 2021-12-24T18:51:29+05:30 IST

వారు పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి సన్మార్గంలో నడపాల్సిన గురువులు. హుందాగా వ్యవహరిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లు.

పిల్లల ముందే కొట్టుకున్న ఉపాధ్యాయులు.. దేని గురించో తెలిస్తే షాక్..!

వారు పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి సన్మార్గంలో నడపాల్సిన గురువులు. హుందాగా వ్యవహరిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లు. అలాంటిది వారే తమ స్థాయి మరిచి బాహాబాహీకి దిగారు. పిల్లల ముందే కొట్టుకున్నారు. ఆ వీడియో వైరల్ కావడంతో విద్యా శాఖ రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరినీ విధుల నుంచి బహిష్కరించింది. రాజస్థాన్‌లోని దౌసా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


దౌసాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం పరీక్ష ఎక్కడ నిర్వహించాలనే విషయంలో ఆ పాఠశాల హెడ్ మాస్టర్, మహిళా టీచర్ మధ్య విభేదాలు తలెత్తాయి. తరగతి గదిలోనే పరీక్ష పెడదామని టీచర్, ఆరు బయట కూర్చోబెడదామని హెడ్ మాస్టర్ వాదులాడుకున్నారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. పిల్లల ముందే పెద్దగా అరుచుకున్నారు. ఒకరినొకరు తోసుకున్నారు. కొట్టుకునే వరకు వెళ్లారు.


ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో విషయం విద్యా శాఖ ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. వారు ఆ ఇద్దరినీ తాత్కాలికంగా విధుల నుంచి బహిష్కరించారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా, ఆ ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గతంలో కూడా ఇలాంటి గొడవలు జరిగినట్టు సమాచారం. 

Updated Date - 2021-12-24T18:51:29+05:30 IST