Viral Video: ప్రిన్సిపల్ పోస్ట్ కోసం టీచర్ల ఫైట్

ABN , First Publish Date - 2021-10-15T23:51:30+05:30 IST

ఈ వీడియోలో కనిపిస్తున్న ఫైటింగ్ సీన్ ఏదో సినిమాలోది కాదు. ఏదో రెజ్లింగ్ కాంపిటీషన్‌లో జరుగుతున్న ఫైటింగ్ కానే కాదు. అలా అని కొట్టుకుంటున్న..

Viral Video: ప్రిన్సిపల్ పోస్ట్ కోసం టీచర్ల ఫైట్

పాట్నా: ఈ వీడియోలో కనిపిస్తున్న ఫైటింగ్ సీన్ ఏదో సినిమాలోది కాదు. ఏదో రెజ్లింగ్ కాంపిటీషన్‌లో జరుగుతున్న ఫైటింగ్ కానే కాదు. అలా అని కొట్టుకుంటున్న ఇద్దరూ వీధి రౌడీలు అంతకంటే కాదు. వారిలో ఒకరు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో పెట్టాల్సిన టీచర్ కాగా.. మరొకరు ఇంకో ఉపాధ్యాయురాలి భర్త. ఆశ్చర్యపోయారా..!


బిహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలోని అదాపూర్‌లో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో శివశంకర్ గిరి, రింకి కుమారి ఇద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పోస్ట్ ఖాళీ అవడంతో.. ఆ పోస్టును ఎలాగైనా పట్టేయాలని ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. 3 నెలలుగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. ‘నీకంటే నేను సీనియర్ అని ఒకరంటే.. మరొకరు నీకంటే నేను ఎక్కువ చదువుకున్నానం’టూ వీరి మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుండేది.


ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు ఇద్దరూ తమ బయోడేటాను సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు టీచర్లూ.. ముందుగా ఎవరు బయోడేటా సమర్పించాలనే విషయంపై వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు తిట్ల పురాణం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన రింకీ కుమారితో వచ్చిన ఆమె భర్త.. ఒక్కసారిగా గిరితో ఫైటింగ్‌కు దిగాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుస్తీ పట్లు పట్టుకున్నారు. వారిని విడిపించాలని, వివాదం సర్దుమణిగేలా చేయాలని అక్కడి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఈ విషయంపై ఇద్దరిలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా..? జిల్లా విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంది..? అనే విషయాలు ఇంకా తెలియలేదు.




Updated Date - 2021-10-15T23:51:30+05:30 IST