Teachersకు టీకా తప్పనిసరి

ABN , First Publish Date - 2021-11-23T13:54:53+05:30 IST

మంచిదని కటువుగా వ్యాఖ్యానించింది. బహిరంగ ప్రాంతాల్లో సంచరించే వారికి టీకా తప్పనిసరి చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అరమ్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ఎ.ఉమర్‌ఫారూఖ్‌ మద్రాసు

Teachersకు టీకా తప్పనిసరి

- విద్యార్థుల శ్రేయస్సుకోసమైనా తప్పదు

- ఇష్టం లేని వాళ్లు ఇంట్లోనే కూర్చోవచ్చు

- తేల్చి చెప్పిన హైకోర్టు


పెరంబూర్‌(చెన్నై): మంచిదని కటువుగా వ్యాఖ్యానించింది. బహిరంగ ప్రాంతాల్లో సంచరించే వారికి టీకా తప్పనిసరి చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అరమ్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ఎ.ఉమర్‌ఫారూఖ్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ భండారీ, న్యాయమూర్తి జస్టిస్‌ ఆదికేశవులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విని పిస్తూ.. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా టీకా వేసుకోవాలని నిర్భంధించరాదని తెలిపారు. టీకా వేసుకుంటే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వుండవని కేంద్రప్రభుత్వం చెబుతున్నా, కొందరు ప్రకృతిసిద్ధ మందులు కూడా తీసుకుంటున్నారని గుర్తు చేశారు. అందువల్ల కరోనా టీకా వేసుకోవాల్సిందేనని టీచర్లను నిర్బంధించరాదని, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనిపట్ల ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. రెండు టీకా డోసులకు కేంద్రం ఆమోదం తెలిపినప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని మార్పులు సంతరించుకోవచ్చని పేర్కొంది. విద్యార్థుల భద్రత దృష్ట్యానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, విద్యార్థుల సంక్షేమం కోసం ఉపాధ్యాయులు టీకా తప్పనిసరిగా వేసుకోవా ల్సిందేనని తేల్చి చెప్పింది. ఏదేని కారణాలతో టీకా వేసుకొనేందుకు ఇష్టం లేని టీచర్లు ఇంట్లోనే కూర్చోవడం మంచిదని పేర్కొంది. టీకాను ఉచితంగా వేసుకొనేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో, ఈ పిటిషన్‌ ప్రజాసంక్షేమానికి వ్యతిరేకంగా దాఖలైనట్లు భావిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కొట్టివేయమంటారా, లేక ఉపసంహరించుకుంటారా అని పిటిషనర్‌ను నిలదీసింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరిం చుకుంటున్నట్టు పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.

Updated Date - 2021-11-23T13:54:53+05:30 IST