మూడో రోజు.. అదే తీరు

ABN , First Publish Date - 2022-08-19T06:34:11+05:30 IST

మూడో రోజు యాప్‌ ఉపాధ్యాయుల ముఖం చూడలేదు.సర్వర్లు మొరాయించడంతో గురు వారం కూడా ముఖ హాజరు వేసుకోలేకపోయారు.

మూడో రోజు.. అదే తీరు
కడియం ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న టీచర్లు

హాజరు నమోదుకు ఉపాధ్యాయుల ఇక్కట్లు


కోరుకొండ/గోపాలపురం/కడియం, ఆగస్టు18: మూడో రోజు యాప్‌ ఉపాధ్యాయుల ముఖం చూడలేదు.సర్వర్లు మొరాయించడంతో గురు వారం కూడా ముఖ హాజరు వేసుకోలేకపోయారు. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధిగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిలబడి ఉదయం 9 గంటల లోపు ముఖ హాజరువే యాలని ఖచ్చి తమైన ఆదేశాలిచ్చారు.నాటి నుంచి గత 3 రోజులుగా ఉపాధ్యాయులు నానా అవస్ధలు పడుతున్నారు. తక్షణం ముఖ హాజరు విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యా యులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ముఖ హాజరును నిరసిస్తూ గోపాలపురం ఎంఆర్‌సీ వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపా ధ్యాయులు గురువారం నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు ఎంఈవో కార్యాలయ ప్రతినిధికి పలు డిమాండ్లతో కూడిన వినతిప త్రాన్ని సమర్పించారు. పాఠశాలల్లో బోధన సమయాన్ని హరిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కడియం  మండల విద్యావనరుల కేంద్రంలో గురువారం యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మండల యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనందకుమార్‌, ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి ఈవీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ చిలుకూరి శ్రీనివాసరావు నేతృత్వంలో పాఠశాలల్లో యాప్‌ల వలన కలిగే ఇబ్బందులను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గోపాలపురంలో ఏపీటీఎప్‌ జిల్లా కార్యదర్శి తనపల రాజశేఖర్‌, యూటీఎఫ్‌ నాయకులు జీ.వెంకటేశ్వ రరావు, జాన్‌బాబు, కడియంలో అల్లాడ బాలాజీ, వి.హనుమంతరావు, వి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T06:34:11+05:30 IST