'ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలి'

ABN , First Publish Date - 2021-10-18T04:49:50+05:30 IST

ఉపాధ్యాయులకు అన్ని క్యాడర్ల పోస్టులకు పదోన్నతి కల్పించాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎం.బాలన్న డిమాండ్‌ చేశారు.

'ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలి'
మాట్లాడుతున్న ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరికృష్ణ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 17: ఉపాధ్యాయులకు అన్ని క్యాడర్ల పోస్టులకు పదోన్నతి కల్పించాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎం.బాలన్న డిమాండ్‌ చేశారు. మద్దూరునగర్‌లోని కాకతీయ పబ్లిక్‌ స్కూల్‌లో ఆదివారం ఎన్‌టీయే ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ఉద్యమ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు వి.ధనుంజయ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ పదోన్నతుల్లో ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీనికి కారణం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే అని ఆరోపించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. జూనియర్‌ లెక్చరర్లు, డైట్‌ లెక్చరర్లు, ఐఏఎస్‌ఈ కళాశాలల లెక్చరర్ల పోస్టులకు ఎస్‌ఈఆర్‌టీలోని లెక్చరర్ల పోస్టులకు పదోన్నతులు టీచర్లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వంద మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు పీఎస్‌హెచ్‌ఎంలను పదోన్నతి కల్పిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీఎంటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎన్‌టీయే జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌ కుమార్‌, ఆపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఏపీసీపీఎస్‌సీఏ రాష్ట్ర కౌన్సిలర్‌ రామనాయుడు, బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు భాస్కర్‌ యాదవ్‌, ఎస్సీ, ఎస్టీ యుఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బన్న, ఎస్‌ఎల్‌టీఏ గౌరవాధ్యక్షుడు పోర్టు జిల్లా చైర్మన్‌ టి.యోగేశ్వరరెడ్డి  పాల్గొన్నారు.


‘రికార్డు అసిస్టెంట్ల అప్‌గ్రేడేషన్‌కు కృషి’ 


న్యూసిటీ: పంచాయతీరాజ్‌ విభాగంలో ల్యాబ్‌, లైబ్రరీ, రికార్డు అసిస్టెంట్లకు జూనియర్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడేషన్‌ చేయించేందుకు కృషి చేస్తామని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌(అమరావతి) రాష్ట్ర అద్యక్షుడు కె.హరిక్రిష్ణ తెలిపారు. ఆదివారం నగరంలోని చర్చా కార్యక్రమానికి హాజరైన ఆయనకు పీఆర్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ కర్నూలు తాలూకా యూనిట్‌ సభ్యులు వినతి పత్రం అందజేశారు. హరిక్రిష్ణ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో అప్‌గ్రేడేషన్‌ విషయాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి బి.వెంకటరమణ, జిన్నా, మసూద్‌, రాఘవ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T04:49:50+05:30 IST