దగ్గర పరీక్షా కేంద్రాల్లో డ్యూటీ వేయాలి: టీచర్లు

ABN , First Publish Date - 2022-05-04T16:20:49+05:30 IST

తక్కువ దూరంలో ఉన్న పరీక్షా కేంద్రాల్లో తమకు విధులు కేటాయించాలని టీచర్లు డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం

దగ్గర పరీక్షా కేంద్రాల్లో డ్యూటీ వేయాలి: టీచర్లు

పెరంబూర్‌(చెన్నై): తక్కువ దూరంలో ఉన్న పరీక్షా కేంద్రాల్లో తమకు విధులు కేటాయించాలని టీచర్లు డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సేలం జిల్లాలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్ల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు 200 మందికి పైగా టీచర్లు జిల్లా ప్రధాన విద్యాధికారి కార్యాలయం ముందు భైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు ఉపాధ్యాయులకు కేటాయించిన పరీక్షా కేంద్రాలు 35 నుంచి 80 కి.మీ దూరం ఉన్నాయన్నారు. విధులకు హాజరుకావాలంటే ఉపాధ్యాయులు ఒకరోజు ముందుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొన్ని పరీక్షా కేంద్రాలకు వెళ్లాలంటే అర్ధరాత్రి 2 గంటలకు ఇంటి నుంచి బయల్దేరాల్సి ఉందన్నారు. 50 ఏళ్లకు పైబడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముందని, ఈ విషయం పరిశీలించి తక్కువ దూరంలోని పరీక్షా కేంద్రాలు కేటాయించాలని కోరారు. 

Read more