పోలీసుల తీరుపై గురువుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-21T04:37:59+05:30 IST

కలెక్టరే ట్‌ ముట్టడికి వెళుతున్న ఉపాధ్యాయుల ను పోలీసులు అడ్డుకోవడంతో వారు రో డ్డుపై బైఠాయించారు.

పోలీసుల తీరుపై గురువుల ఆగ్రహం
నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు

జమ్మలమడుగు నుంచి తరలిన ఉపాధ్యాయులు

కొత్తపల్లె బైపాస్‌ రోడ్డుపై బైఠాయింపు

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 20: కలెక్టరే ట్‌ ముట్టడికి వెళుతున్న ఉపాధ్యాయుల ను పోలీసులు అడ్డుకోవడంతో వారు రో డ్డుపై బైఠాయించారు. ఉపాధ్యాయ సం ఘాల సమాఖ్య పిలుపు మేరకు అయా ఉపాధ్యాయ సంఘాల నేతలు, తోటి ఉపాధ్యాయులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో కడపకు వెళ్తుండగా పట్టణ శివా రు కొత్తపల్లె బైపాస్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఉపాధ్యాయులకు మధ్య వాగ్వాదం జరిగిం ది.

ఆన్‌డ్యూటీలో ఎలావెళతారని పోలీ సులు ప్రశ్నించారు. న్యాయమైన డి మాండ్ల కోసం వెళ్తుంటే, పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. పోలీసుల తీరు ను నిరసిస్తూ, అక్కడే రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తర హా పీఆర్‌సీని ఎప్పుడూ చూడలేదని, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడమంటే ఇదే కాబోలు అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో పోలీసులు ఉపాధ్యాయ సంఘ నేతలను, ఉపాధ్యాయులను చాపాడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కల్యాణమండపానికి తరలించారు. 

జమ్మలమడుగు నుంచి 400 మంది...

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 20: జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ కేంద్రం నుంచి గురువా రం ఉదయం కడపలో జరిగే కలెక్టర్‌ ముట్టడికి సుమారు 400 మంది ఉపాధ్యాయులు తరలి వెళ్లారని ఫ్యాప్టో సంఘ నేతలు తెలిపారు. జమ్మలమడుగు క్యాంబెల్‌ ఆస్పత్రి నుంచి వాహనా ల్లో బయల్దేరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్‌సీని వ్యతిరేకిస్తూ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడికి పెద్ద ఎ త్తున ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. కాగా మార్గమధ్యలో పోలీసు లు అడ్డుపడినా తర్వాత వదిలినట్లు ఫ్యాప్టో నేతలు తెలిపారు. ఏది ఏమైనా కార్యక్రమం విజయవంతం చేశామన్నా రు. కార్యక్రమంలో ఫ్యాప్టో నేతలు ఆర్‌.గురుకుమార్‌, నాగార్జునరెడ్డి, నాగరా జు, మహ్మద్‌గౌస్‌, మురళీకృష్ణ, నరసింహారెడ్డి, రవిశంకర్‌ నేతలు పాల్గొన్నారు.  

అదుపులో సంఘ నేతలు 

కొండాపురం, జనవరి 20: పీఆర్సీ జీఓను వెనక్కి తీసుకోవాలని కడపకు వెళ్తున్న మండల ఉద్యోగ సంఘం నేతలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఉదయాన్నే చాలా మంది ఉపాధ్యాయులు కడపకు వెళ్లిపోగా, ముగ్గురిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని బైండోవర్‌ చేశారు. వారిని పూచీకత్తుమీద మళ్లీ విడుద ల చేసినట్లు ఎస్‌ఐ మద్దిలేటి తెలిపారు. 

Updated Date - 2022-01-21T04:37:59+05:30 IST