పాఠశాలలపై కరోనా పడగ

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

పాఠశాలలపై కరోనా పడగ విప్పుతోంది. జిల్లాలో ఎంతోమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వైరస్‌ బారినపడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలుకాకపోవడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యార్థులు మాస్కులు పెట్టుకోకపోయినా, భౌతిక దూ రం పాటించకపోయినా పట్టించుకున్న నాథుడే లేదు. ఫలితంగా పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. గురువారం జిల్లాలో వివిధ పాఠశాలలను ‘ఆంధ్రజ్యోతి’ సందర్శించి ంది. అక్కడ కొవిడ్‌ నిబంధనలు అమలును నిశితంగా పరిశీలించి ంది. దీంతో చాలా పాఠశాలలు కొవిడ్‌ నిబంధనలు విస్మరించినట్టు కనిపించింది.

పాఠశాలలపై కరోనా పడగ
శ్రీకాకుళం గర్ల్స్‌ హైస్కూల్‌లో భోజన విరామ సమయంలో... మాస్కులు తీసేసి పాఠశాల మైదానంలో విద్యార్థినులు ఇలా..

- వైరస్‌ బారిన ఉపాధ్యాయులు, విద్యార్థులు

- సక్రమంగా అమలుకాని కొవిడ్‌ నిబంధనలు 

- ఆందోళనలో తల్లిదండ్రులు 

- చిన్నారులను బడికి పంపేందుకు వెనుకడుగు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

పాఠశాలలపై కరోనా పడగ విప్పుతోంది. జిల్లాలో ఎంతోమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వైరస్‌ బారినపడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలుకాకపోవడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యార్థులు మాస్కులు పెట్టుకోకపోయినా, భౌతిక దూ రం పాటించకపోయినా పట్టించుకున్న నాథుడే లేదు. ఫలితంగా పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. గురువారం జిల్లాలో వివిధ పాఠశాలలను ‘ఆంధ్రజ్యోతి’ సందర్శించి ంది. అక్కడ కొవిడ్‌ నిబంధనలు అమలును నిశితంగా పరిశీలించి ంది. దీంతో చాలా పాఠశాలలు కొవిడ్‌ నిబంధనలు విస్మరించినట్టు కనిపించింది. జిల్లాలో 3,274 ప్రభుత్వ, 554 ప్రైవేట్‌ మొత్తం 3,828 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,77,592 మంది విద్యార్థులు చదువు తున్నారు. కరోనా రెండోదశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ భారిన పడుతున్నారు. ప్రతిరోజూ ఏదోఒక పాఠశాలలో కరోనా కేసులు నమోదవుతుండ డంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత నెల 1 నుంచి ఇప్పటివరకూ 45 మంది ఉపాధ్యాయులు, 84 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో కొంత మంది కోలుకోగా, మరికొందరు హోంఐసోలేషన్‌, కొవిడ్‌కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


నిబంధనలు గాలికి..


కొవిడ్‌ నిబంధనల ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖచ్చి తంగా మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటిస్తూ తరగతులు నిర్వహిం చాలి. శానిటైజర్‌తో చేతులను శుభ్రపరుచుకోవాలి. ఈ నిబంధనలు చాలా పాఠశాలల్లో గాలికొది లేశారు. కొన్ని పాఠశాల ల్లో తరగతి గదులు చాలా చిన్నవి కావడం, మరి కొన్నిచోట్ల ‘నాడు-నేడు’ పనులతో గదులను అప్పజెప్పక పోవడం, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండ డం... వంటి కారణాలతో విద్యార్థులు దగ్గరదగ్గరగానే కూర్చో వలసి వస్తోంది. మాస్కు ధరించే విషయంలో కూడా విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. కొందరు మాస్కు లను నోటి వరకో... గొంతు వరకో పెట్టుకుంటు న్నారు. మరికొందరు అసలు మాస్కు లే తీసుకురావడం లేదు. మధ్యాహ్న భోజన సమయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. పాఠశా లలకు వచ్చేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు విద్యా ర్థులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఇటువంటి వారిపై కొవిడ్‌ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల ను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు ఆలోచిస్తు న్నారు. ఆన్‌లైన్‌ తరగతులే మేలంటూ ప్రైవేట్‌ పాఠ శాలల్లో చదివే విద్యార్థుల తల్లితండ్రులు అభిప్రాయ పడుతున్నారు. కరో నా ఉధృతి తగ్గేవరకూ పిల్లలను బడులకు పంపక పోవడమే మంచిదంటు న్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసు కుంటుందా? అని ఎదురుచూస్తున్నారు.


మాస్కులు పెట్టుకోరు.. భౌతికదూరం పాటించరు!

కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతున్న వేళ.. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు కానరావడం లేదు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశా లల్లో గురువారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా.. ఈ విషయం బయటపడింది. పలాసలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పెద్దగా పాటించడం లేదు. ప్రభు త్వం విద్యార్థులకు మాస్క్‌లు పంపిణీ చేసినా.. 60 శాతం మంది వాటిని ధరించలేదు. బ్యాగుల్లోనే దాచుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన చేస్తున్న సమ యంలో కొంతమంది విద్యార్థులు మాస్క్‌లు ధరిం చేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టారు. ప్రార్థనా సమయంలో భౌతికదూరం పాటించలేదు. ఒక్కో తర గతికి సుమారు 70 మంది విద్యార్థులు ఉండగా.. ఒక్కో బెంచీపై ముగ్గురేసి దగ్గరదగ్గరగా కూర్చొన్నారు. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పత్రాలు, ఓట్ల లెక్కిం పునకు మొత్తం ఆరు గదులు కేటాయించారు. దీంతో వరండాలోనే భౌతికదూరం విస్మరించి.. తరగతులు నిర్వ హిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 1152 మంది విద్యా ర్థు లు ఉన్నారని, అందుకే కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టడం సాధ్యం కావడం లేదని ఒక ఉపాధ్యా యుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

-  ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాలలో 21 తరగతి గదులు ఉండగా, 1500 విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులంతా మాస్క్‌లు ధరిం చినా.. భౌతికదూరం మాత్రం పాటించలేదు. ఒక్కో తరగతి లో 70 నుంచి 80 మంది విద్యార్థులకు బోధిస్తున్నారు. రోజుకు ఒకసారి మాత్రమే శానిటైజర్‌ వినియోగిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా తరగతులు లేక భౌతికదూరం పాటించలేక పోతున్నా మని ప్రధా నోపాధ్యాయులు డి.వి.త్రినాథరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.  ఈ విషయం డీఈవో దృష్టికి తీసుకెళ్లామని, అనుమతి వచ్చిన వెం టనే సెక్షన్ల వారీగా రోజువిడిచి రోజు తరగతులు నిర్వహిస్తామ న్నారు. సోంపేట ప్రభుత్వ పాఠశాలలో శానిటైజర్లు ఏర్పాటు చేయలేదు. విద్యార్థులు భౌతికదూరం పాటించడం లేదు. కవిటి ప్రభుత్వ పాఠశాలలోనూ అదే పరిస్థితి కనిపించింది.

- పాలకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా కొవిడ్‌ నిబంధనలు అమలుకావడం లేదు. ఈ పాఠశాలలో 386 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గురువారం 275 మంది   హాజ రయ్యారు. భౌతికదూరం పాటించకుండా ఒక్కో 40 మంది విద్యా ర్థులు చొప్పున కూర్చొన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామని, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని ప్రధానోపాధ్యాయుడు అనంతరావు తెలిపారు.

- ఆమదాలవలసలోని లక్ష్మీనగర్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశా లలో విద్యార్థులు గదుల్లో కిక్కిరిసి కూర్చొన్నారు. ఈ పాఠశాలలో 15 తరగతి గదులు ఉండగా.. 1080 మంది విద్యార్థులు చదువు తున్నారు. పదోతరగతి విద్యార్థులకు 4 సెక్షన్లు, ఆరో తరగతి విద్యా ర్థులకు 3 సెక్షన్లుగా బోధన సాగిస్తున్నారు. ఒక్కో గదిలో 70 నుం చి 86 మంది ఉండగా.. వెలుతురు సౌకర్యం కూడా లేదు. ఒక్కో బెంచిపై ముగ్గురేసి కూర్చొంటున్నారు. శానిటైజర్లు వినియోగించ డం లేదు. మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రోజువిడిచి రోజు తరగతులు నిర్వహిస్తున్నారు. 1,3,5 తరగతులకు ఒకరోజు, 2,4 తరగతులకు మరోరోజు బోధన చేస్తున్నారు.

- రణస్థలం జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులు భౌతికదూరం పాటించడం లేదు. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. పూర్తి స్థాయిలో గదులు లేకపోవడంతో ఆరు బయట, వరండ, చెట్లకింద బోఽధన జరుగుతుంది. 8వ తరగతి విద్యార్థులు కనీసం భౌతిక దూరం పాటించలేదు. దగ్గరదగ్గరగా కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారు. మాస్కులు ధరించినప్పటికీ శానిటైజర్‌ వినియోగించడం లేదు.

-  రాజాంలో కరోనాకేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. రాజాంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోయారు. సెలవులు ప్రకటించాలని కోరినా యాజమాన్యం స్పందించ లేదని తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


నిబంధనలు అమలవుతున్నాయి

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు అమలవుతున్నాయి. జాగ్రత్తలు పాటిస్తూనే తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. తల్లితండ్రులు వారి పిల్లలను మాస్కులతో పాఠశాలలకు పంపించాలి.

-కుసుమ చంద్రకళ, జిల్లా విద్యాశాఖాధికారి

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST