యాప్‌ల నుంచి విముక్తి కల్పించండి

ABN , First Publish Date - 2022-08-19T05:12:41+05:30 IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ల భారం నుంచి ఉపాధ్యాయులను విముక్తి చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం కాళ్ళ మండలంలోని పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.

యాప్‌ల నుంచి విముక్తి కల్పించండి
కాళ్ళ ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయులు

కాళ్ళ, ఆగస్టు 18: ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ల భారం నుంచి ఉపాధ్యాయులను విముక్తి చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం కాళ్ళ మండలంలోని పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం తదితర వివరాలు నమోదు చేయడానికి పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ సొంత ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై ఉపాధ్యాయులు అభ్యంతరం తెలిపారు. యాప్‌ డౌన్‌లోడ్‌తో వ్యక్తిగత సమాచారం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాటుచేస్తే హాజరు, ఇతర వివరాలు నమోదు చేయగలమన్నారు. అనం తరం ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి సీహెచ్‌.పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణంరాజు, మండల అధ్యక్షుడు బీఆర్‌ఎంకె.స్వామి, మండల కార్యదర్శి కిశోర్‌, శ్రీనివాసరాజు, ఎస్టీయూ కార్యదర్శులు వి.జనార్దన్‌, సీహెచ్‌.మోహన్‌బాబు, పి.పాపారావు, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


పాలకోడేరు: ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం వివరాల నమోదుకు ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ ఉపాధ్యాయుల ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలనడం సరికాదని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ విజయరామరాజు తెలిపారు. మండల విద్యాశాఖాధికారికి ఫ్యాఫ్టో ఆధ్వర్యం లో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ విజయరామరాజు, మండల ప్రధాన కార్యదర్శి కె త్రిమూర్తులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయు ప్రధానకార్యదర్శి బి పాండురంగారావు, సుధాకర్‌, ఫణి శేఖర్‌, పాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:12:41+05:30 IST