టెన్త్‌ స్పాట్‌ వద్ద టీచర్ల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-18T06:01:19+05:30 IST

అధికారంలోకివచ్చి మూడేళ్ళు గడిచినా సీపీఎస్‌ను రద్దుచేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకమైన జీపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రతిపాదించడం దుర్మార్గమని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నిరసించింది

టెన్త్‌ స్పాట్‌ వద్ద టీచర్ల ఆందోళన
ఏలూరు సెయింట్‌ గ్జేవియర్‌ పాఠశాల వద్ద మోకాళ్లపై ఉపాధ్యాయ సంఘం నాయకుల నిరసన

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 17: అధికారంలోకివచ్చి మూడేళ్ళు గడిచినా సీపీఎస్‌ను రద్దుచేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకమైన జీపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రతిపాదించడం దుర్మార్గమని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నిరసించింది అధికారంలోకివచ్చి మూడేళ్ళు గడిచినా సీపీఎస్‌ను రద్దుచేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకమైన జీపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రతిపాదించడం దుర్మార్గమని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నిరసించింది. ఏలూరు జిల్లా కేంద్రం సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూలు లో నిర్వహిస్తున్న పదో తరగతి మూ ల్యాంకన కేంద్రంవద్ద మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ మాట్లాడు తూ సీపీఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి జగన్‌ వైఖరిని దుయ్యబట్టారు. ఎస్‌టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీని వాస్‌ మాట్లాడుతూ ఇంటీరియం రిలీఫ్‌పై అదనంగా 5–10 శాతం పెంచి పీఆర్‌సీని ప్రకటించడం ఆనవాయితీగా వస్తుండగా, దీనికి భిన్నంగా జగన్‌ నాలుగు అడుగులు వెనక్కివేసి 27 శాతంగావున్న ఐఆర్‌ను 23 శాతానికి తగ్గించారని విమర్శించారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి సాల్మన్‌ రాజు, బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్‌కుమా ర్‌ మాట్లాడుతూ స్పాట్‌ పారితోషికాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం టెన్త్‌ స్పాట్‌ కేంద్రంలో టీచర్ల సమస్యలపై ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ దృష్టిసారించారు. మూల్యాంకనం జరుగుతున్న గదులవద్దకు వెళ్ళి సౌకర్యాలపై ఉపాధ్యాయులను అడిగితెలుసుకున్నారు. సమస్యల పరిష్కరించాల్సిందిగా డీఈవో గంగాభవానిని కోరారు.


Updated Date - 2022-05-18T06:01:19+05:30 IST