ఉపాధ్యాయుల ఉద్యమం

ABN , First Publish Date - 2021-07-30T04:56:54+05:30 IST

సమస్యల పరిష్కారం కోరు తూ ఉపాధ్యాయులు ఉద్యమించారు.

ఉపాధ్యాయుల ఉద్యమం
కొవ్వూరు ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయులు

నూతన విద్యా విధానం వద్దు 

సీపీఎస్‌ రద్దు చేయాలి 

ప్రతీ నెల 1న జీతాలివ్వాలి


కొవ్వూరు/జంగారెడ్డిగూడెం టౌన్‌, జూలై 29: సమస్యల పరిష్కారం కోరు తూ ఉపాధ్యాయులు ఉద్యమించారు. ఆర్డీవో కార్యాలయాల వద్ద గురువారం ధర్నా చేపట్టారు. నూతన విద్యా విధానం వద్దని, సీపీ ఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలని, ప్రతీ నెల 1న జీతాలు ఇవ్వాలని నినదించారు. ఏపీటీఎఫ్‌ కొవ్వూరు డివిజన్‌ కన్వీనర్‌ డి.దుర్గారావు మాట్లాడు తూ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించవలసిన పీఆర్‌సీ, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రెండేళ్లుగా ఉపాధ్యాయులకు అందించవలసిన పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయకపోవడం బాధాకరమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పింఛను విధానాన్ని అమలు పరచాలన్నారు. డీఎస్సీ వెంటనే ప్రకటించి, విద్యాశాఖలోని అన్ని యాజమాన్యాలలో ఖాళీగా ఉన్న పోస్టులలో పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలన్నారు. నూతన విద్యా విధానం పేరుతో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలింపును నిలుపుదల చేయాలన్నారు. ఈ విదానంలో పేద విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరం అవుతారని, నూతన విద్యా విధానంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఆర్డీవో డి.లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు మండల అధ్యక్షులు షేక్‌ మహ్మద్‌ సలీం, డి.జాన్‌, రాజశేఖర్‌, కొండేపాటి శ్రీను, కారింకి శ్రీను, ఎస్వీ రంగారావు, జానీ, దేవసహాయం, గంగరాజు, రఘువీరశాస్త్రి దేవరపల్లి, తాళ్లపూడి, నిడదవోలు, కొవ్వూరు మండలాల ఏపీటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు ఐవి.రత్నం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి.రెడ్డి దొర మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీ నం చేయడం, ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన లేకపోవడం, ఉన్నత పాఠశాలల్లో బోధనా మాధ్యమాన్ని ఎన్నుకునే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వక పోవడం, 9వ తరగతి నుంచి 12వ సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయడం వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వ విద్యారంగం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీడీఏ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో భాషా పండితు లను, పీఈటి పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్‌ చేసి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి యూవీఎన్‌.రాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు కె.నాగేశ్వరావు, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూ డెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నాయకులు ఎస్‌కె.అలీషా, పి.జ గదీష్‌, కె.సుబ్బారావు, త్రివేణీ, లలితాదేవీ, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-30T04:56:54+05:30 IST