Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏజెన్సీలో ఉపాధ్యాయ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి


 టీడీపీ కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు

చింతపల్లి, అక్టోబరు 26: ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని టీడీపీ కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం బౌర్తి ప్రాథమిక పాఠశాలను టీడీపీ నాయకులు సందర్శించారు. పాఠశాల విద్యా బోధనపై విద్యార్థులు, స్థానిక గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, బౌర్తి పాఠశాలలో ఉపాధ్యాయుడు లేక మూతబడిందని, చింతపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం కొండలరావు నెల రోజుల క్రితం ఒక టీచర్‌ని డిప్యూటేషన్‌ వేశారన్నారు. సోమవారం ఆ టీచర్‌ డీఈవో కార్యాలయానికి వెళితే పాడేరు ఎమ్మెల్యే వచ్చి హడావిడి చేశారన్నారు. బౌర్తి మాదిరిగా ఏజెన్సీ వ్యాప్తంగా 139 ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతబడ్డాయన్నారు. కనీసం ఉపాధ్యాయుల ఖాళీల్లో సీఆర్‌టీలను నియమించి విద్యాబోధన అందించాల్సిన పాలకులు, అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఖాళీగానున్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కిల్లో పూర్ణచందర్‌, పార్టీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు, కిముడు లక్ష్మయ్య, పాంగి రాము, అప్పారావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement