నేడు ఏపీ కలెక్టరేట్ల ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పిలుపు

ABN , First Publish Date - 2022-01-20T13:16:09+05:30 IST

నేడు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యా యులు పిలుపునిచ్చారు.

నేడు ఏపీ కలెక్టరేట్ల ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పిలుపు

కడప:నేడు కలెక్టరేట్ల ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ, హెచ్‌ఆర్‌ తగ్గింపు, సీసీఏ రద్దు, 70-75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌కు సంబంధించి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలి పోతున్నారు. 


ఈ మేరకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఏపీ వ్యాప్తంగా నిరసన, ఆందోళనలు చేపట్టనున్నారు. కాగా పోలీసులు పలు జిల్లాలో ముందస్తుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి  ముందస్తు అరెస్టులు చేస్తుండడంతో  ఉపాధ్యాయ సంఘాల నేతలు  ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విడుదల చేసిన జీవోలతో పూర్తిగా నష్టపోవాల్సి వస్తోందని  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-20T13:16:09+05:30 IST