నిబంధన.లకు విరుద్ధంగా ఉపాధ్యాయ బదిలీలు

ABN , First Publish Date - 2021-01-19T05:22:32+05:30 IST

కు విరుద్ధంగా బదిలీలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూనాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, డీఈవో నాగమణికి ఫిర్యాదు చేశారు. వంగపండు హేమలత అనే ఉపాధ్యాయురాలు 2017 ఆగస్టు మొదటిన జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో ప్రిపరెన్షియల్‌ కేటగిరీ ద్వారా గుంకలాం ఎంపీపీ పాఠశాల నుంచి జొన్నవలస పాఠశాలకు బదిలీపై వెళ్లారని ఫి

నిబంధన.లకు విరుద్ధంగా ఉపాధ్యాయ బదిలీలు
డీఈవోకు వినతిపత్రం అందిస్తున్న పీఆర్‌టీయూ ప్రతినిధులు




విజయనగరం/ కలెక్టరేట్‌:  నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు పొందిన వారిపై  చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూనాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, డీఈవో నాగమణికి ఫిర్యాదు చేశారు. వంగపండు హేమలత అనే ఉపాధ్యాయురాలు 2017 ఆగస్టు మొదటిన జరిగిన  బదిలీల కౌన్సెలింగ్‌లో ప్రిపరెన్షియల్‌ కేటగిరీ ద్వారా గుంకలాం ఎంపీపీ పాఠశాల నుంచి జొన్నవలస పాఠశాలకు బదిలీపై వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె భర్త కోరుడ్ల గిరిబాబు(శేషగిరి) అనే ఉపాఽధ్యాయుడు బొండపల్లి మండలం జియన్నవలస నుంచి మూడేళ్ల కాకముందు మరోసారి ప్రిపరెన్షియల్‌ కేటగిరీ అక్రమంగా వాడుకుని విజయనగరం మండలం రామజోగిపేట (20 శాతం)కు బదిలీపై వెళ్లారని తెలిపారు.  ప్రభుత్వం నిబంధనల ప్రకారం 54 పేరా 10 ప్రకారం ఎనిమిదేళ్లకు ఒకసారి ప్రిపరెన్షియల్‌ కేటగిరీ వినియోగించాలని చెప్పారు.  నిబంధనలను అతిక్రమించినందున ప్రభుత్వ ఉత్తర్వు 54 ప్రకారం లెఫ్ట్‌ ఓవర్‌ వేకెన్సీని కేటాయించాలని కోరారు. దీనిపై రాష్ట్రస్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు   పీఆర్‌టీయూ నాయకులు ఎ.రాంబాబు, వి.తవిటినాయుడు  తదితరులు తెలిపారు.

జీవో 54కు అనుగుణంగానే...
జీవో 54 ప్రకారం ప్రిపరెన్సియల్‌ కేటగిరీ వ్యక్తిగతంగా వర్తిస్తుందని ఉపాధ్యాయుడు కె.శేషగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పౌజ్‌ కేటగిరీలో భార్యభర్తల్లో ఒకరు ఎనిమిదేళ్లలో ఒకసారి మాత్రమే వినియోగించాలని తెలిపారు. అయితే ప్రిపరెన్షియల్‌ అలాకాదని, ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు ఎనిమిదేళ్లలో  ఒకసారి వినియోగించుకోవచ్చని తెలిపారు. భార్యభర్తలైనప్పటికీ , పాయింట్‌ 10 నోట్‌ 2 ప్రకారం స్పెషల్‌ పాయింట్లు వినియోగిస్తే ఈ సౌకర్యం వర్తించదని చెప్పారు. తాము గత 8 సంవత్సరాల వ్యవధిలో స్పౌజ్‌ పాయింట్లు కానీ,ఎటువంటి స్పెషల్‌ పాయింట్లు  వినియోగించుకోలేదని స్పష్టం చేశా రు.తాము ప్రిపరెన్సియల్‌ కేటగిరీ వినియోగించుకోవడానికి అర్హులమని వెల్లడించారు.  



Updated Date - 2021-01-19T05:22:32+05:30 IST